Actor : నాలుగేళ్ల వయసులోనే సర్వేపల్లి రాధాకృష్ణన్ మన్ననలు… ఈ బుజ్జిగాడు ఏ హీరోనో గుర్తు పట్టారా?

Actor : చలనచిత్ర ప్రపంచంలో చాలా మంది నటీనటులు తమ బాల్యాన్ని సినిమా సెట్లలో గడిపారు. కొందరైతే చిన్న వయసులోనే తమ నటనతో ఫేమస్ అయ్యి ఇప్పటికీ సినీ ప్రపంచంలో పాపులర్‌గా ఉండేంత అద్భుతంగా నటిస్తున్నారు. అయితే ఓ హీరో మాత్రం నాలుగేళ్ల వయసులోనే సర్వేపల్లి రాధాకృష్ణన్ మన్ననలు అందుకున్నాడు. పైన పిక్ లో కన్పిస్తున్న ఆ బుజ్జిగాడు ఇప్పుడు ఒక లెజెండరీ సౌత్ స్టార్. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా ఆ హీరో ఎవరో తెలుసుకుందాం పదండి.

4 ఏళ్లకే సర్వేపల్లి రాధాకృష్ణన్ మన్ననలు

పైన పిక్ లో ఉన్న ఆ చిన్నారి బాలుడు దేశ రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా కేవలం 4 సంవత్సరాల వయస్సులో బంగారు పతకం అందుకున్నాడు. కాస్త నిశితంగా గమనిస్తే ఆ పిక్ లో ఉన్న స్టార్ హీరో ఎవరో ఇట్టే గుర్తుపడతారు. 4 ఏళ్లకే తొలి సినిమా ‘కలత్తూరు కనమ్మ’తో దేశ రెండో రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న ఈ బాలుడు మరెవరో కాదు లోకనాయకుడు కమల్ హాసన్. ప్రస్తుతం ఆయన దేశంలోని దిగ్గజ నటుల్లో ఒకరన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌత్ నుంచి నార్త్ దాకా ఆయనకున్న ఫ్యాన్స్ బేస్ కూడా అందరికీ తెలిసిందే. కమల్
హాసన్ వయసు ఇప్పుడు 65 ఏళ్లకు పైనే. కానీ ఆయన అతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. కనీసం ఊహ కూడా తెలియని వయసులో ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా. అయితే ఈ అవార్డు పొందుతున్నప్పుడు అతని చిన్నారి మనసు ఏమనుకుంటుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. క‌మ‌ల్ హాస‌న్ స్వ‌యంగా ‘ది క‌పిల్ శ‌ర్మ షో’లో చాలా రోజుల క్రితం ఈ విష‌యాన్ని చెప్పారు.

From Mahesh Babu to Kamal Haasan: Meet stars who started their career as  child actors — In Pics

- Advertisement -

కొన్నాళ్ళ క్రితం కమల్ హాసన్ తన బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమ్’ సినిమా ప్రమోషన్ కోసం ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొన్నాడు. ఆ సమయంలో డిని గురించి ప్రస్తావిస్తూ ఇంత చిన్న వయసులో నీకు అవార్డు వచ్చినప్పుడు రాష్ట్రపతి ఎవరో తెలుసా అని కపిల్ అడిగాడు. దీనిపై కమల్ మాట్లాడుతూ.. ‘ఫోటో చూస్తుంటే కింద ఉన్న అవార్డుని అలా చూస్తున్నా… అంతే. ఏదో పెద్ద కానుక ఇస్తారని చిన్నప్పుడు అనుకున్నాను. యాంత్రిక తుపాకీ.. ఏదో బొమ్మ’. కానీ అవార్డును ఇవ్వడంతో ఆ సమయంలో దాని వాల్యూ తెలియక సంతోషపడలేదు అని కమల్‌ అన్నారు. అప్పట్లో ఆయన ఏం అనుకున్నారు అనే విషయాన్ని వెల్లడించడంతో అంతా నవ్వేశారు.

కమల్ హాసన్ ఆల్ రౌండర్

కమల్ ఆల్ రౌండర్ అని చెప్పాలి. ఆయన కేవలం నటనలోనే కాదు డ్యాన్స్ లోనూ ప్రావీణ్యం ఉన్న నటుడు. జెమినీ గణేశన్, సావిత్రి జంటగా ‘కలత్తూరు కన్నమ్మ’ సినిమాతో నట ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం తమిళ భాషలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును కూడా అందుకుంది. కమల్ నటన, డ్యాన్స్, సంగీతంతో పాటు స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్, ఫిల్మ్ ప్రొడక్షన్‌లో కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. రీసెంట్ గా కల్కితో విలన్ కూడా మెప్పించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు