Actor : 10 రోజులు మిస్సై శవంగా తేలిన యాక్టర్… హత్యా? ఆత్మహత్యా?

Actor : సెప్టెంబర్ 3న అదృశ్యమైన ఒక నటుడు 10 రోజుల తర్వాత శవమై కనిపించడం సంచలనంగా మారింది. కన్పించినకుండా పోయిన సదరు నటుడి గురించి ఆయన అభిమానులు త్వరగా తిరిగి రావాలని ప్రార్థిస్తుంటే, స్వయంగా ఆయన సోదరి సోషల్ మీడియా ద్వారా తన మరణ వార్తను ప్రకటించి షాక్ ఇచ్చింది. దీంతో ఆయనది హత్యా? లేక ఆత్మహత్యా? అనే చర్చ మొదలైంది. మరి ఆ నటుడు ఎవరో ఒక లుక్కేద్దాం పదండి.

సోదరి నుండి భావోద్వేగ పోస్ట్

ప్రస్తుతం ఎక్కడ చూసినా మలైకా అరోరా తండ్రి సూసైడ్ గురించే చర్చ నడుస్తోంది. ఆయన ఏకంగా ఆరు అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అంటూ ఇంకా ఆయన సూసైడ్ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు మలైకా ఫ్యాన్స్. మరోవైపు ఈ హఠాత్ పరిణామానికి తారా లోకం నివ్వెరపోయింది. ఇక ఇప్పుడు మలైకా తండ్రి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. మరోవైపు ప్రముఖ తెలుగు లిరిక్ రైటర్ గురు చరణ్ కూడా అనారోగ్యంతో కన్నుమూసి తెలుగు మూవీ ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు. అంతలోనే మరో ప్రముఖ టీవీ నటుడి మృతదేహం లభ్యమైంది. కోమో డైస్ ఎల్ డిచో అనే టీవీ సిరీస్ ద్వారా పేరు ప్రఖ్యాతులను సంపాదించిన నటుడు జేమ్స్ హాల్ క్రాఫ్ట్‌ శవమై కనిపించాడు. సెప్టెంబర్ 3న అదృశ్యమైన ఆయన 10 రోజుల తర్వాత శవమై కనిపించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. జేన్ హాల్‌క్రాఫ్ట్ సోదరి అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ సమాచారాన్ని అందించింది. అదే సమయంలో భావోద్వేగంతో కూడిన పోస్ట్ రాసి నివాళులర్పించారు. ఈ ఊహించని వార్తకు షాక్ అయిన హాలీవుడ్ టీవి ప్రియులు, పలువురు ప్రముఖులు జేమ్స్ హాల్ క్రాఫ్ట్‌ మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా జేమ్స్ హాల్ క్రాఫ్ట్‌ సోదరి భావోద్వేగ పోస్ట్‌ని షేర్ చేశారు. “మీరు ఎల్లప్పుడూ మాతో, మా హృదయాలలో ఉంటారు. చాలా సంవత్సరాలు కలిసి ఉన్నందుకు, అద్భుతమైన క్షణాలను గడిపినందుకు ధన్యవాదాలు” అంటూ ఆమె తన సోదరుడి మరణం గురించి ఎమోషనల్ పోస్ట్ చేసింది.

James Hollcroft: Últimas noticias, videos y fotos de James Hollcroft |  Univision

- Advertisement -

జేమ్స్ మరణానికి కారణం ఏమిటి? హత్యా లేక ఆత్మహత్యా?

నటుడు జేమ్స్ హాల్‌క్రాఫ్ట్ మరణవార్త అభిమానులను విషాదంలోకి నెట్టింది. ఆయన అసలు ఎలా చనిపోయాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే జేమ్స్ మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. కానీ జేమ్స్ హాల్‌క్రాఫ్ట్ మెక్సికో సిటీలోని టిజపాన్‌లో ఉన్న తన ఇంటికి తిరిగి వస్తుండగా తప్పిపోయినట్లు వార్తలు వచ్చాయి. జేమ్స్ ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే.. జేమ్స్ ‘కోమో డైస్ ఎల్ డిచో’ అనే టీవి సిరీస్ లో తన పాత్రతో విపరీతమైన పాపులారిటీని తెచ్చుకున్నాడు. అంతేకాదు ఆయన Diem QCకు సంబంధించిన పదకొండవ సీజన్‌లో కూడా నటించి, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లాడన్న వార్త తెలిసి, జేమ్స్ మరణానికి కారణం అక్కడి పోలీస్ అధికారులు కనిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు