Actor Ajay: ఎన్టీఆర్ పై సంచలన కామెంట్స్ చేసిన అజయ్.. అసలు మనిషే కాదంటూ..?

Actor Ajay.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా కట్టిపడేసే అతి కొద్దిమంది నటులలో యాక్టర్ అజయ్ కూడా ఒకరు. ముఖ్యంగా విక్రమార్కుడు సినిమాలో విలన్ గా నటించి తనదైన నటనతో అందరిని కట్టిపడేసిన అజయ్.. మహేష్ బాబును మొదలుకొని చాలామంది స్టార్ హీరోల సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అజయ్ చాలా సినిమాలను స్టార్ హీరోలకు ఫ్రెండ్ గా లేదా ఆ హీరోలకు ధీటుగా విలన్ గా నటించి ఆకట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. స్టార్ హీరో, టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గొప్ప మనసున్న వ్యక్తిగా పేరు దక్కించుకున్న ఎన్టీఆర్ పై సంచలన కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.

Actor Ajay: Ajay who made sensational comments on NTR.. as if he is not a real person..?
Actor Ajay: Ajay who made sensational comments on NTR.. as if he is not a real person..?

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకొని ,నేడు పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న హీరోలలో ఎన్టీఆర్ కూడా ఒకరు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఈయన తన తదుపరి చిత్రాలను కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కిస్తూ ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఎన్టీఆర్ నటుడుగానే కాదు మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆయన గొప్పతనం గురించి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నటుడు అజయ్ కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

ఎన్టీఆర్ మనిషి కాదు రోబో..

అజయ్ ఒక సందర్భంలో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కాంబో ఆఫ్ డాన్స్ అంటూ వెల్లడించిన అజయ్, ఆయన ఎంతో అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తారు. ఒక్కసారి కంటితో చూస్తే డాన్స్ చేసేస్తారు. నాకు తెలిసిన “వరల్డ్ బెస్ట్ డాన్సర్” ఎన్టీఆర్ మాత్రమే అంటూ తెలియజేశారు. ఇక్కడ నటన పరంగా మాత్రమే కాదు డైలాగ్ విషయంలో కూడా ఆయన తర్వాతే ఎవరైనా. అసలు డైలాగ్ విషయంలో ఎన్టీఆర్ “మనిషే కాదు ఒక రోబో”లా చెబుతారు అంటూ ప్రశంసించారు అజయ్. ప్రస్తుతం అజయ్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.

- Advertisement -

అజయ్ కెరియర్..

అజయ్ ఆంధ్ర అబ్బాయి..విజయవాడలో జన్మించారు. తన తండ్రి ఉద్యోగరీత్యా నెల్లూరు ,తిరుపతి వంటి ప్రాంతాలలో ఉద్యోగం చేయడం వల్ల ఈయన విద్యాభ్యాసం ఆ ప్రాంతాలలో పూర్తి అయినట్లు సమాచారం. 1995లో ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ చేయడానికి హైదరాబాద్ వచ్చిన ఈయన జూబ్లీహిల్స్ లోని ఒక కాలేజీలో చేరాడు. అయితే ఇతరులను చూసి నటన మీద ఆసక్తి పెంచుకున్న అజయ్ మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరి నటనలో శిక్షణ తీసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు