Bandla Ganesh : నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు అస్వస్థత.. అపోలోలో చికిత్స

Bandla Ganesh : టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు సాయంత్రం అస్వస్థతకి గురి కావడం వల్ల జూబ్లీహిల్స్ లో అపోలో ఆసుపత్రికి తన కుటుంబ సభ్యులు హుటాహుటిన తరలించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రముఖ నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించిన విషయం తెలిసిందే. అంతే కాదు గబ్బర్ సింగ్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించి పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ మధ్య సినిమాలు ప్రొడ్యూస్ చేయడం తగ్గించారు. అయితే గత ఐదారేళ్లుగా రాజీకీయాల్లో బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ కార్యదర్శిగా ఈయన కొనసాగుతున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం రాజకీయనేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఈరోజు (సోమవారం) సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో అస్వస్థతకు గురవటంతో.. తన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన జూబ్లీ‌హిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందజేస్తున్నారు.

Actor Bandla Ganesh was hospitalized due to serious illness

ఆస్పత్రి బెడ్ పై బండ్ల గణేష్ వీడియో వైరల్..

అయితే అపోలో ఆస్పత్రి లో బెడ్ మీద బండ్ల గణేష్ (Bandla Ganesh) ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో.. ఓ నర్సు బండ్ల గణేష్‌కు సెలైన్ పెడుతూ కన్పించింది. అయితే.. బెడ్‌పై ఆయన చాలా నీరసంగా కనిపిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన సన్నిహితులు, బంధువులు చెప్తున్నారు. ఇక బండ్ల గణేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని అక్కడి వైద్యుల మాట. ఇక దీనిపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

కాంట్రోవర్సీలకు కేరాఫ్..

ఇక ఇండస్ట్రీలో, రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వార్తల్లో నిలిచే బండ్ల గణేష్ ఉన్నట్టుండి ఇలా అస్వస్థతకు గురికావటంతో ఆయన మిత్రులు, పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నేతలతో ఉంటూ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు బండ్ల గణేష్. మరోవైపు.. ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో ఘాటైన కౌంటర్లు వేస్తూ.. వార్తల్లో హెడ్‌లైన్‌గా నిలుస్తున్నారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందంటూ బల్లగుద్ది చెప్పి అప్పట్లో బాగా వార్తల్లో నిలిచారు. అలాంటిది.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో.. ఇలా జరగటంతో కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానులు కొంత నిరుహ్సాతానికి గురవుతున్నారు. ఇక తెలుగు సినిమాల్లో నిర్మాత గా మంచి పేరున్న బండ్ల గణేష్ ఈ మధ్య సినిమాలు తీయడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ కి భక్తుడుగా పిలిపించుకునే బండ్ల గణేష్ ఆయనతో సినిమాలు తీయడానికి ఇప్పటికి కూడా ముందుటాడు బండ్ల గణేష్. ఈ మధ్య సినిమాలకి సంబంధించిన వార్తలలో కనిపించకపోయినా, రాజకీయాలకు సంబంధించిన వార్తలలో బండ్ల గణేష్ బిజీ అయ్యాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు