Bramhaji : మీరు పిల్లల్ని ప్రేమిస్తే.. వాళ్లకి నేర్పండి.. నెటిజన్లకు బ్రహ్మాజీ రియాక్షన్!

Bramhaji : టాలీవుడ్ సింగర్ చిన్మయి గత కొన్ని రోజుల కింద ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన గురించి స్పందిస్తూ, ఆడపిల్లల తల్లిదండ్రులను కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే చిన్మయి అన్నదానికి చాలామంది నెటిజన్లు మద్దతివ్వగా, కొందరు ట్రోల్ చేసారు. అయితే చిన్మయి భర్త నటుడు రాహుల్ రవీంద్రన్ తనకు సపోర్ట్ గా నిలిచాడు. పలు సెన్సిటివ్ అంశాలపై చిన్మయి రియాక్ట్ అవ్వగా, సోషల్ మీడియాలో తండ్రీ కూతుళ్ల రిలేషన్ మీద చిన్మయి ఇలా మాట్లాడుతోందేంటి? కొందరు నెటిజన్లు నానా రకాలుగా ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. అయితే చిన్మయి పోస్ట్ చేసిన విషయంపై లోతుగా ఆలోచించలేకపోతున్నారు. తాజాగా చిన్మయికి మద్దతుగా ఓ మహిళా జర్నలిస్ట్ పోస్ట్ చేసింది.

Actor Bramhaji supports to singer Chinmayi

చిన్మయికి మద్దతుగా బ్రహ్మాజీ…

అయితే సోషల్ మీడియాలో చిన్మయి ని ట్రోల్ చేస్తూ చాలామంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తల్లి దండ్రులు గారాబంగా చూసుకునే పిల్లలు స్కూల్‌ కి వెళ్లమని, తినమని, ఆదుకుంటామని మారాం చేస్తారు. మరి అప్పుడు కూడా వారిని బలవంత పెట్టొద్దా? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే చిన్మయికి మద్దతుగా ఓ మహిళా జర్నలిస్ట్ ట్వీట్ వేసింది. అయితే చిన్మయి కి సపోర్ట్ చేస్తూ ఈ ట్వీట్ వేసిన సదరు జర్నలిస్ట్ పై నటుడు బ్రహ్మాజీ (Bramhaji) రియాక్ట్ అయ్యాడు.

- Advertisement -

మీరు మీ పిల్లలకి నేర్పండి – బ్రహ్మాజీ

సదరు మహిళా జర్నలిస్ట్ చిన్మయికి మద్దతుగా ట్వీట్ వేయగా, ఆమె ట్వీట్ కు బ్రహ్మాజీ రిప్లై ఇస్తూ, “మీరు గనుక మీ పిల్లల్ని ప్రేమిస్తే.. మీకంటూ ఓ బాధ్యత ఉంటే”.. కన్సెంట్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మీరు కూడా తెలుసుకోండి.. “మీ పిల్లలకి నేర్పించండి.. వారిని జాగ్రత్తగా చూసుకోండి” అంటూ బ్రహ్మాజీ చెప్పుకొచ్చాడు. అయితే బ్రహ్మాజీ ఇలా చిన్మయికి మద్దతుగా నిలవడంతో తనపై కూడా ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఇక బ్రహ్మాజీ ఫ్యాన్స్ అయితే ఇవన్నీ మనకు ఎందుకన్నా… అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో, ఎప్పుడు ముగుస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా నటుడు బ్రహ్మాజీ అయితే వరుస సినిమాలతో ఇప్పటికీ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు