Actor Chinna: మహేష్ పై అలాంటి కామెంట్స్ చేసిన యాక్టర్ చిన్నా..!

Actor Chinna.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు సినిమాల పరంగా మాత్రమే కాదు గొప్ప మనసు చాటుకోవడంలో కూడా ఎప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా వెయ్యి మందికి పైగా చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించి, తన మంచి మనసును చాటుకున్న విషయం తెలిసిందే. తన సినిమాలలో తనతో పాటు నటించే నటీనటులకు కూడా ఆయన అంతే గౌరవం ఇస్తారు. తాజాగా ఇదే విషయాన్ని ప్రముఖ నటుడు చిన్న మీడియాతో పంచుకున్నారు.

Actor Chinna: Actor Chinna who made such comments on Mahesh..!
Actor Chinna: Actor Chinna who made such comments on Mahesh..!

మహేష్ బాబు మంచితనంపై సెలబ్రిటీస్ కామెంట్స్..

కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా , సోనాలి బింద్రే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం మురారి. తాజాగా ఈ సినిమా ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో మహేష్ బాబు అభిమానులంతా ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి తెగ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చాలా మంది ఈ సినిమాలో నటించిన నటీనటులు ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వస్తూ మహేష్ బాబుతో తమకున్న అనుబంధాలను పంచుకుంటున్నారు. ఇటీవల గత కొద్ది రోజుల క్రితం ప్రముఖ నటి సుధ మహేష్ బాబుతో ఉన్న అనుబంధాన్ని పంచుకోగా , ఇప్పుడు చిన్నా కూడా సెట్ లో జరిగిన కొన్ని విషయాలను అలాగే ఆయన మంచితనాన్ని చెప్పుకొచ్చారు.

రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న మురారి..

ప్రస్తుతం మురారి రీ రిలీజ్ కి కూడా ప్రమోషన్స్ చేస్తున్న నేపథ్యంలో సీనియర్ నటుడు చిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అందులో మురారి షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటనను చెప్పుకొచ్చారు.

- Advertisement -

స్టార్ హీరో అయినా గర్వం చూపించుకోరు..

సీనియర్ నటుడు చిన్నా మాట్లాడుతూ.. మురారి సినిమా 50 రోజులు అవుట్ డోర్ షూటింగ్ రామచంద్రాపురంలో జరిగింది షూటింగ్లో భాగంగా అందరికీ ప్రొడక్షన్ హౌస్ నుండి ఫుడ్ అందిస్తారు. అయితే నాకు ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చే ఆహారం పడదు. షూటింగ్లో ఉంటే నాకు ఇంటి నుంచి బాక్స్ వచ్చేది. కానీ అవుట్ డోర్ లో ఉండడం వల్ల ఒకటి రెండు రోజులైతే అడ్జస్ట్ అయ్యే వాడిని కానీ ఆ తర్వాత కుదిరేది కాదు. అప్పటికే నాకు కృష్ణ గారి ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉండేవి .మురారి షూటింగ్ సమయంలో మహేష్ కి నిర్మాత చెల్లెలి వాళ్ళు అక్కడే రామచంద్రపురం లో ఉండడంతో ఇంటి నుండి భోజనం పంపించేవారు. దాంతో నేను కూడా మహేష్ దగ్గరికి వెళ్లి నేను బయట ఫుడ్డు తినలేక పోతున్నాను అంటూ నా సమస్య చెప్పి, ఏమనుకోకపోతే మీ ఫుడ్ నాకు పెడతారా అంటూ సిగ్గు లేకుండా అడిగాను.

ఎంగిలి అన్నం తినేవారు..

అలా 50 రోజుల పాటు నేను మధ్యాహ్నం లంచ్ సమయంలో మహేష్ దగ్గరకు వెళ్లి భోజనం చేసేవాడిని. అయితే ఒక్కొక్కసారి మాకు లంచ్ బ్రేక్ ఇచ్చినా మహేష్ కి లంచ్ బ్రేక్ ఇవ్వకపోవడంతో ఆయనకు లేట్ అయ్యేది. ఒకరోజు ఆయనే మా దగ్గరకు వచ్చి మీరు తినేయండి నేను మళ్ళీ వస్తాను అన్నారు. అప్పటినుంచి మేము ముందుగా వెళ్లి మహేష్ కోసం తెచ్చిన ఫుడ్ ను తినేసి మిగిలిస్తే దానిని ఆయన తినేవాళ్లు..ఏ రోజు కూడా ఆయన అంత గొప్ప స్టార్ అయ్యుండి ఆ గర్వాన్ని చూపించుకోలేదు. చాలా మంచివారు .చాలా బాగా చూసుకుంటారు అంటూ మహేష్ బాబును పొగిడారు చిన్నా.. ఇక ఈ విషయం తెలిసి మహేష్ అభిమానులు కూడా మహేష్ బాబు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు