Thangalaan : స్టేజ్ పైనే సుమకి కిస్ ఇచ్చిన తంగలాన్ యాక్టర్.. ఒక్కసారిగా షాకైన సుమ ఏం చేసిందంటే.?

Thangalaan : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా ఆగష్టు 15న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ పా.రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ పీరియాడిక్ హారర్ యాక్షన్ డ్రామాలో మాళవిక మోహనన్, పార్వతి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ మూవీ ఫైనల్ గా పంద్రాగస్టున రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్ కూడా మూవీ లవర్స్ ని అమితంగా ఆకట్టుకున్నాయి. తంగలాన్ లో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని సమాచారం. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తుండగా, తాజాగా తంగలాన్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకకు విక్రమ్ సహా చిత్ర యూనిట్ హాజరవగా, ఈ ఈవెంట్ కి సుమ హోస్ట్ గా వ్యవహరించింది.

Actor Daniel kissed Suma's hand at the Tangalan pre-release event

 

- Advertisement -

స్టేజ్ పైనే సుమ కి ముద్దిచ్చిన తంగలాన్ నటుడు..

ఇక తంగలాన్ (Thangalaan) ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా సందడిగా జరగగా, చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, అలాగే డైరెక్టర్ పా రంజిత్ స్పీచ్ లు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఈవెంట్ లో సుమకు అనుకోని ఘటన జరిగి ఒక్కసారిగా సుమ షాక్ అయ్యేలా చేసింది. అసలు విషయానికి వస్తే.. ఈ ఈవెంట్ లో తంగలాన్ నటులు ఒక్కొక్కరూ స్టేజ్‌ పైకి వచ్చి మాట్లాడారు. అలాగే ఈ సినిమాలో నటించిన డేనియల్ అనే విదేశీ నటుడ్ని కూడా సుమ స్టేజ్ ఆహ్వానించింది. ఇక డేనియల్ కూడా స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాడు. అయితే డేనియల్ కిందకి వెళ్లేటప్పుడు థాంక్యూ అంటూ యాంకర్ సుమ షేక్ హ్యాండ్ ఇవ్వగా, డేనియల్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి సడన్ గా సుమ చేతిపై కిస్ ఇచ్చాడు. ఈ అనుకోని ఘటనకి సుమ ఒక్కసారిగా షాక్ అయింది.

సుమ ఏం చేసిందంటే?

అయితే సుమ చేతికి కిస్ ఇచ్చిన డేనియల్ ఇందులో ఏముంది అన్నట్లుగా నవ్వుకున్నాడు. వెంటనే తేరుకున్న సుమ మాట్లాడుతూ.. “నేను ఈరోజు ఇంటికెళ్తానా.. ఓరి నాయనో.. రాజా (రాజీవ్ కనకాల) ఈయన మా అన్నయ్య.. రాఖీ వస్తుంది.. అన్నయ్య సన్నిధి నుండి”.. అంటూ సుమ కవర్ చేసేసింది. కానీ ఈ ఘటనలో సుమ ఖచ్చితంగా ఇబ్బంది పడిందని తన మొహం చూస్తేనే తెలుస్తుంది. కానీ ఈవెంట్‌కి ఇబ్బంది కలగకూడదని సుమ కవర్ చేసింది. దీనిపై నెటిజన్లు ఆ నటుడ్ని ఇండియాకి వచ్చినపుడు ఎలా ఉండాలో తెలీదా అంటూ తిడుతున్నారు.. అలాగే సుమని చాకచక్యంగా వ్యవహరించినందుకు ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనా ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు