Aho Vikramarka : చరణ్‌పై మగధీర విలన్ సంచలన కామెంట్స్

Aho Vikramarka : చరణ్‌పై మగధీర బాలీవుడ్ నటుడు దేవ్ గిల్ సంచలన కామెంట్స్ చేశాడు. రామ్‌ చరణ్‌ నా హీరో అంటూ వెల్లడించారు. బాలీవుడ్ నటుడు దేవ్ గిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేవ్ మగధీర సినిమాలో విలన్ గా కనిపించి స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత వివిధ భాషల్లోనూ విలన్ గా సినిమాల్లో నటిస్తున్నాడు. ఓ పక్క విలన్ గా చేస్తూనే….మరో పక్క హీరోగా కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా దేవ్ గిల్ హీరోగా పాన్ ఇండియా సినిమా ‘అహో విక్రమార్క’ తో మన అందరి ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తెలుగు టీజర్ ని రాజమౌళి విడుదల చేశారు. ఈ సినిమాలో తేజస్విని పండిట్, చిత్ర శుక్ల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

పేట త్రికోటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం అహో విక్రమార్క సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. ఈ సందర్భంగా దేవ్ గిల్ మాట్లాడుతూ…. “మగధీర సినిమా సమయం నుంచి నా మీద ఎంతో ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. పూనేలో మా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చి ఉండవచ్చు. కానీ హైదరాబాదులో రాజమౌళి గారు నాకు పేరు, ప్రతిష్టలు ఇచ్చారని తెలిపారు. రమా గారు నాకు తల్లిలా ఎంతో సపోర్ట్ చేశారని వివరించారు దేవ్ గిల్.

Aho Vikramaarka Teaser release

- Advertisement -

 

వారి వల్లే ఈరోజు అహో విక్రమార్క అనే సినిమాని నిర్మించగలిగాను. 12, 13 ఏళ్ల క్రితం రాజమౌళి గారు నన్ను ముంబై నుంచి తీసుకొచ్చి నాకు జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు నేను ఓ హీరోగా సినిమాను తీశాను. నాకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. నన్ను ఇంతవరకు విలన్ గా చూశారు. నామీద ఎంతో ప్రేమను కురిపించారు. కానీ ఈ సినిమాతో మీ అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నానని తెలిపారు దేవ్ గిల్. త్రికోటికి చాలా పెద్ద విజన్ ఉంది. మా టీజర్ అందరికీ నచ్చిందని ఎంతో ఆశిస్తున్నాను. త్వరలోనే పాటలు కూడా రిలీజ్ చేస్తాం. మా సినిమా మీద ఆడియన్స్ ప్రేమను కురిపించి ఆదరించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

https://x.com/TejaRcCult/status/1803694155480310257

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు