Actor Hema : టాలీవుడ్ యాక్టర్ హేమ పేరు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది.. ఒకప్పుడు సినిమాల్లో ఈమె పేరు వినిపించేది… కానీ ఇప్పుడు మాత్రం రోజుకో వివాదాలతో వార్తల్లో హైలెట్ అవుతుంది.. నటి హేమ ఇటీవల బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొని వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె ఆ పార్టీలో పాల్గొన్నా పాల్గొనలేదని చెప్పింది.. కానీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.. ఈ క్రమంలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు పరీక్షల్లో రుజువు కావడంతో ఈమె పేరు సంచలనంగా మారింది..
ఆ కేసు రోజుకో మలుపు తిరగడంతో ఆమె చుట్టు అనేక వివాదాలు చుట్టుకున్నాయి.. ఆ వివాదం నుంచి ఇటీవలే బెయిల్ మీద నుంచి బయటకు వచ్చింది.. కేసు నుంచి బయటకు వచ్చిన ఇన్ని రోజులకు మీడియా ముందుకు వచ్చింది.. తాజాగా హేమ నేడు ఉదయం తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది.. దీంతో తిరుమల నుంచి హేమ వీడియోలు వైరల్ గా మారాయి. పలువురు జనాలు హేమతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. హేమ దర్శనం చేసుకొని బయటకి వచ్చిన తర్వాత మీడియా ఆమె వద్దకు వచ్చారు… అప్పుడు తీసిన వీడేమో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది..
గుడి నుంచి బయటకు వచ్చిన అనంతరం ఈమె మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారి దర్శనం బాగా జరిగింది.. అలాగే నేను ఇక్కడే పుట్టానని మీకు తెలుసు. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నా పుట్టిల్లులా ఉంటుంది అని తెలిపింది. అయితే మీడియా రేవ్ పార్టీ ఇష్యూ గురించి ప్రశ్నించడంతో హేమ సమాధానమిస్తూ.. ఏమో మీకే తెలియాలి.. మీకు తెలియకుండా ఏమి ఉండదు.. మీకు నచ్చినట్లు వార్తలు చెప్తున్నారు కదా.. అసలు ఏం జరిగిందో త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పింది.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.. ఇక ఈమెను మా అభ్యత్వం నుంచి కూడా తొలగించినట్లు తెలిసిందే..