Actor: బ్యాక్ టు బ్యాక్ 15 డిజాస్టర్లు ఇచ్చినా తగ్గని క్రేజ్… పవర్ స్టార్ సినిమాకు కోట్లలో డిమాండ్

Actor : సినిమా రంగంలో వరుసగా హిట్లు కొట్టిన స్టార్స్ కే మంచి డిమాండ్ ఉంటుంది. హిట్ రేట్ పెరిగే కొద్దీ నటీనటులకు ముఖ్యంగా హీరోలకు రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరుగుతుంది. కానీ ఓ యంగ్ హీరోకి మాత్రం ఏకంగా బ్యాక్ టు బ్యాక్ 15 డిజాస్టర్లు పడినప్పటికీ ఇంకా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడానికి అతను భారీగా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కెరీర్లో ఇన్ని ప్లాప్స్ ఉన్నప్పటికీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్న ఆ హీరో ఎవరో తెలుసుకుందాం పదండి.

రొమాన్స్ కు కేరాఫ్ అడ్రస్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో మరెవరో కాదు ఇమ్రాన్ హష్మీ. రొమాన్స్ కు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ హీరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తండ్రికి సొంత మేనల్లుడే. మంచి బ్యాగ్రౌండ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఇండస్ట్రీలో తనకంటూ రొమాంటిక్ హీరోగా ఓ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. ముఖ్యంగా ఆయన సినిమా అంటే లిప్ లాక్ సీన్లే అన్నట్టుగా ఈ హీరోపై ముద్ర పడిపోయింది. రాజ్ మూవీతో అసిస్టెంట్ డైరెక్టర్ గా హిందీ చిత్ర పరిశ్రమలోకి కాలు పెట్టిన ఇమ్రాన్ హష్మీ ఫుట్ పాత్ సినిమాతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మారి, సినిమాల్లోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ, ఆ తర్వాత ఏడాదికి రిలీజ్ అయిన మర్డర్ మూవీ ఇమ్రాన్ హష్మీ ఫేట్ ను మార్చేసింది. ఇక ఆ తర్వాత డర్టీ పిక్చర్, వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై, గ్యాంగ్ స్టర్, మర్డర్ 2 సూపర్ డూపర్ సినిమాలు చేసిన ఈ హీరో ఒకానొక దశలో వరుసగా డిజాస్టర్లు అందుకున్నాడు.

Emraan Hashmi Birthday: The Underrated Star Ready To Rule 2023 With Salman  Khan's Tiger 3

- Advertisement -

సినిమాలకు బ్రేక్.. రీఎంట్రీ

వరుస డిజాస్టర్ల వల్ల కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి, ఆ తర్వాత విలన్ గా రీఎంట్రీ ఇచ్చాడు. 2023లో రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీలో విలన్ గా అదరగొట్టేశాడు. ఇక ప్రస్తుతం ఈ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజి మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి విలన్ క్యారెక్టర్ పోషిస్తుండగా, ఇందులో ఆయన పవర్ ఫుల్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 6 కోట్లు పారితోషికంగా డిమాండ్ చేశారట. నిర్మాతలు కూడా ఇమ్రాన్ హష్మీకి అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర గానీ క్లిక్ అయ్యిందంటే టాలీవుడ్ నుంచి విలన్ గా అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు బాలీవుడ్ బడా హీరోలు బిజీ అవుతున్న విషయం తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్ తో పాటు పలువురు హిందీ స్టార్స్ విలన్లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మరి ఇమ్రాన్ హష్మీ కెరీర్ టాలీవుడ్ లో ఎలా ఉంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు