Actor Jayachandran Arrested : బాలికపై అత్యాచారం… దృశ్యం నటుడు అరెస్ట్

Actor Jayachandran Arrested : నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో ఓ నటుడు అరెస్ట్ కావడం సినిమా ఇండస్ట్రిలో సంచలనంగా మారింది. ఆ క్రూరమైన నటుడిపై ఫోక్సో చట్టం కింద కేసు పెట్టి, ఘటనను విచారిస్తున్నారు పోలీసులు. ఈ దారుణమైన ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? ఇంతటి నీచానికి దిగజారిన ఆ నటుడు ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే..

దృశ్యం నటుడిపై ఫోక్సో చట్టం

‘దృశ్యం’తో పాటు పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్, విలన్‌ పాత్రలు పోషించిన మలయాళ నటుడు కూటికల్ జయచంద్రన్ బాలికపై అత్యాచారం కేసులో తాజాగా అరెస్టయ్యాడు. పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలులో పెట్టారు.

అసలేం జరిగిందంటే ?

ఘటన జరిగిన రోజు పలు కారణాల వల్ల బయటకు వెళ్లిన బాలిక చాలాసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఆమె వచ్చేసరికే బాలిక దుస్తులు కాస్త చిరిగిపోయి, శరీరం దుమ్ము కొట్టుకుపోయి ఉండటాన్ని బంధువులు గమనించారు. పాపను అడిగి అసలు విషయం తెలుసుకున్న బంధువులు, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

POSCO case registered against actor Koottickal Jayachandran for sexually  abusing a four-year-old

ఎక్కడ జరిగింది?

ఈ ఘటన కేరళలోని ఓ ప్రాంతంలో చోటు చేసుకుంది. అతని స్వస్థలం పాలక్కాడ్ అయినప్పటికీ, అతను కొంతకాలం పొల్లాచ్చిలో నివసించినట్లు చెబుతున్నారు. ఈ కేసులో కోజికోడ్ పోలీస్ స్టేషన్‌లో 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు జరిపాడు అంటూ జయచంద్రన్ పై పాప తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులతో ఏర్పడిన వివాదాన్ని అవకాశంగా తీసుకుని జయచంద్ర నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడని బాలిక తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది.

చిన్నారి వాంగ్మూలం

జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆదేశాల మేరకు పోలీసులు చిన్నారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. విచారణలో భాగంగా అధికారులు చిన్నారి నివాసానికి వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తదుపరి సాక్ష్యాలను సేకరించి, ఆరోపించిన సంఘటనకు సంబంధించిన వివరాలను నిర్ధారించడానికి అధికారులు పని చేస్తున్నట్టు సమాచారం.

ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలంటూ డిమాండ్

అలాగే నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో నటుడు జయచంద్రన్‌ను కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు, పాప బంధువులు డిమాండ్ చేస్తుండటం గమనార్హం. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు కోపంతో రగిలిపోతూ అతన్ని సినిమా ఇండస్ట్రి నుంచి బహిష్కరించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. నటుడిగా నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఇతను ఈ వయసులో నాలుగేళ్ల పాపను లైంగిక వేధింపులకు గురి చేయడం సిగ్గు చేటు అంటూ ఫైర్ అవుతున్నారు.

జయచంద్రన్ ఎవరు?

జయచంద్రన్ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. తరువాత యాంకర్ గా మారాడు. జగతి వర్సెస్ జగతి, కామెడీ టైమ్ వంటి కార్యక్రమాలతో ప్రముఖ టెలివిజన్ హోస్ట్ గా ఎదిగారు. ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతను దృశ్యంలో కీలక పాత్ర పోషించాడు. దానితో పాటు న్జాన్, ఒరు సెకండ్ క్లాస్ యాత్ర, లక్ష్యం, నారధన్, మై బాస్, డిటెక్టివ్ వంటి అనేక మలయాళ హిట్ సినిమాల్లో కూడా నటించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు