Kalki2898AD : శ్రీకృష్ణుడిగా నటించింది ఎవరో తెలుసా? అసలు గెస్ చేసి ఉండరు

Kalki2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా ఎట్టకేలకు ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న విడుదలై యనానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుని థియేటర్లలో దుమ్ము లేపుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి సినిమా ఈ ఇయర్ లోనే బిగ్గెస్ట్ సినిమాగా రిలీజ్ అయి సినీప్రియుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేస్తుంది. ఇక ఈ సినిమాలోని ప్రతి పాత్ర, ప్రతి సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఆల్రెడీ మహానటితో ఎంతో నిరూపించుకున్న నాగ్ అశ్విన్ కల్కితో తన దర్శకత్వ ప్రతిభ ఏపాటిదో చూపిస్తున్నాడు. ఇక థియేటర్ల వద్ద ప్రీమియర్స్ నుండే మూవీ లవర్స్ రచ్చ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తో సహా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ అభిమానులకి ఐ ఫీస్ట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. అలాగే విజయ్ దేవరకొండ గెస్ట్ అప్పీరెన్స్ తో విజయ్ ఫ్యాన్స్ కూడా ఖుషి అయ్యారు. దీన్ని బట్టి థియేటర్లలో అల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ ఖాయమని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా కల్కి (Kalki2898AD) లో మహాభారత్ ఎపిసోడ్ లో శ్రీ కృష్ణుడి రోల్ చాలా కీలక పాత్ర వహించింది. అయితే ఈ పాత్ర ని ఓ పెద్ద స్టార్ హీరో చేసి ఉంటాడని అనుకున్నారు. కానీ ఆ ప్రతిష్టాత్మక పాత్రలో నటించిన వారు ఎవరో తెలిసిపోయింది.

Actor Krishna Kumar played the role of Lord Krishna in the movie Kalki2898AD

శ్రీ కృష్ణుడిగా నటించిన వారిని ఊహించలేరు కూడా?

అయితే కల్కి సినిమాలో శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడి పాత్రను థియేటర్లలో చూసినపుడు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ పాత్రలో శ్రీకృష్ణుడి ముఖాన్ని బహిర్గతం చేయకుండా నాగ్ అశ్విన్ జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ పాత్రని చూసిన పలు హీరోల ఆయా ప్రేక్షకులు తమ అభిమాన హీరోలను ఆ పాత్రలో ఊహించుకునేలా చేసాడు నాగి. నిన్నటి నుండి ఆ రోల్ ఎవరు చేసారో అని నెట్టింట తెగ వెతుకుతున్నారు మూవీ లవర్స్. అయితే ఈ పాత్రలో ఎవరు నటించారు అన్న ప్రశ్నపై మిస్టరీ ఎట్టకేలకు బయటపడింది. శ్రీ కృష్ణుడి పాత్రలో నటించిన వ్యక్తి పేరు “కృష్ణ కుమార్ బాల సుబ్రహ్మణ్యన్”. బహుశా ఇతను కొత్త నటుడు కావచ్చని అనుకోవచ్చు. కానీ ఇతను ఇంతకు ముందు కూడా పలు సినిమాల్లో నటించాడు. సూర్య హీరో నటించిన “సూరయి పొట్రు” (తెలుగులో ఆకాశమే నీ హద్దు రా) సినిమాలో నటించాడు. ఆ సినిమాలో కృష్ణ కుమార్ సూర్య స్నేహితుడుగా మరియు సహ పైలట్‌ గా నటించాడు.

- Advertisement -

తన పాత్రను రివీల్ చేసిన కృష్ణ కుమార్..

అయితే కల్కి లో శ్రీ కృష్ణుడి పాత్రలో నటించింది తానే అని ఇంస్టాగ్రామ్ లో స్టేటస్ ద్వారా రివీల్ చేసాడు కృష్ణ కుమార్. ఇక ఆ పాత్ర లో నటించిన కృష్ణ కుమార్ తనే అని రివీల్ చేసినప్పటినుండి, కృష్ణ కుమార్ తన పాత్రకు ఆడియన్స్ నుండి మంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక ఇంత పెద్ద తెలుగు పాన్ ఇండియా సినిమాలో తాను భాగమైనందుకు నటుడు కృష్ణ కుమార్ తనకెంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే కృష్ణ కుమార్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆ పాత్రకు మరింత ఇంటెన్సిటీ తీసుకొచ్చాడని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక కల్కి2898 ADలో మహాభారత్ కి సంబంధించి ప్రభాస్ కర్ణుడిగా, అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ గా, విజయ్ దేవరకొండ అర్జునుడిగా, అలాగే మాళవిక నాయర్ ఉత్తరగా నటించారని రివీల్ అయిపొయింది. మరి రెండో పార్ట్ లో మహాభారత్ కి సంబంధించి మరిన్ని పాత్రలు ఎలా చూపిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు