Meena : ఎన్నాళ్ళైంది మీనాను ఇలా చూసి .. స్టైలిష్ లుక్ లో భలే ఉంది కదా..

Actor Meena : సీనియర్ యాక్టర్ మీనా గురించి ఎంత చెప్పినా తక్కువే… అందం, అభినయం ఉన్న హీరోయిన్ మీనా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఓ ఊపేసింది.. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి బాగా పాపులారిటిని అందుకుంది.. హీరోయిన్ గానే కాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాల్లో నటించింది.. మీనా ఈ మధ్య కాలంలో ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఈమె చేతిలో అర డజను సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది.. అయితే ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

actor meena stylish look photos viral in social media
actor meena stylish look photos viral in social media

మీనా ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించారు. ఇప్పటికే అదే సౌందర్యంతో చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటున్నారు మీనా. ఇక మీనా పలు తెలుగు, తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు.. వయసు పెరిగిన తరగని అందంతో కుర్ర హీరోయిన్లకు చెమటలు పట్టిస్తున్నారు.. ఈ మధ్య నెట్టింట గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.. తాజాగా వైట్ టీ షర్ట్, బ్లూ జీన్స్ లో కనిపించింది.. ఎప్పుడూ పద్దతిగా ఉండే మీనా ఇప్పుడు ఇలా స్టైలిష్ లుక్ లో కనిపించడం పై ఆమె ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

actor meena stylish look photos viral in social media
actor meena stylish look photos viral in social media

మీనా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతో బిజీగా గడుపుతున్న సమయంలో తన భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. తన భర్త మరణంతో ఎంతో కృంగిపోయిన మీనాకు తన స్నేహితులు ఇతర నటీమణులు ధైర్యం చెబుతూ తనని తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చారు.. సినిమాలు లేని సమయంలో ఆమె ఎక్కువగా ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తుంది.. ఇక రెండో పెళ్లి పై కొన్ని వార్తలు కూడా వచ్చాయి.. వాటిని పెద్దగా పట్టించుకోలేదు.. ఎప్పటికప్పుడు వాటికి క్లారిటీ ఇస్తూ వచ్చింది.. అయినా ఆమె పై ట్రోల్స్ ఆగడం లేదు.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది..

actor meena stylish look photos viral in social media
actor meena stylish look photos viral in social media

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు