Actor Mohan: స్టార్ హీరోకు ఎయిడ్స్ పై క్లారిటీ ఇచ్చిన నటుడు..!

Actor Mohan.. సెలబ్రెటీలు అన్న తర్వాత సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా ఏవో ఒక రూమర్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా చిన్న విషయం దొరికితే చాలు పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తూ ఉంటారు. గతంలో కూడా ఇలాంటి రూమర్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి. అలా ఒక సీనియర్ హీరో తన ఆరోగ్యం గురించి వచ్చిన వార్తల పైన ఇప్పుడు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నటుడు మోహన్ పైన వచ్చిన రూమర్ తో ఒకసారిగా ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.

హీరోకి ఎయిడ్స్ అంటూ వార్తలు

Actor Mohan: The actor who gave clarity on AIDS to star hero..!
Actor Mohan: The actor who gave clarity on AIDS to star hero..!

1980లో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు మోహన్.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. హీరోగా మంచి స్టార్డం అందుకున్న సమయంలో అతని గురించి కొన్ని రూమర్స్ వచ్చాయట. ఆ రూమర్స్ కి ఇప్పుడు క్లారిటీ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా మోహన్ మాట్లాడుతూ.. తాను 1990లో సినీ ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నప్పుడు తన మీద కావాలని కొంతమంది రూమర్స్ క్రియేట్ చేశారని.. అవి తన కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాయని.. ముఖ్యంగా తనకు ఎయిడ్స్ వచ్చిందని.. కొంతమంది ప్రచారాన్ని చాలా విపరీతంగా చేశారని.. ఈ విషయం అటు అభిమానులను ఇటు తన కుటుంబాన్ని కూడా ఆందోళన చేసేలా చేసిందని తెలిపారు.

కుటుంబమే అండగా..

కానీ ఆ సమయంలో తన కుటుంబమే తనకు అండగా నిలిచిందని .. తనకు ఎలాంటి ఎయిడ్స్ లేదని క్లారిటీ ఇవ్వమంటూ కూడా ఒక జర్నలిస్ట్ సలహా ఇచ్చారని కూడా తెలిపారు.. అయితే తాను అందుకు అసలు ఒప్పుకోలేదని ఈ రూమర్ సృష్టించింది మీడియా వాళ్లే కాబట్టి ఆ తప్పును కూడా వారే సరిదిద్దుకోవాలని చెప్పానని తెలిపారు. కానీ చివరికి మాత్రం తనను బలి చేశారని తెలిపారు.

- Advertisement -

మోహన్ నటించిన సినిమాలు..

తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాల నటించారు మోహన్.తెలుగులో తూర్పు వెళ్లే రైలు, చూపులు కలిసిన శుభవేళ, స్రవంతి తదితర చిత్రాలలో నటించారు.. అయితే ఇన్నాళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మోహన్ ఇప్పుడు హర అనే ఒక తమిళ సినిమాలో నటిస్తున్నారు. దాదాపుగా కొన్నేళ్ల క్రితం రూమర్స్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది నటుడు మోహన్ కు సపోర్టు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా సెలబ్రిటీలకు సంబంధించిన ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెట్టాలి అంటే వెంటనే సెలబ్రిటీలు అప్పటికప్పుడే స్పందిస్తే ఆ తర్వాత ఆ వార్తలు మళ్లీ స్ప్రెడ్ కావు.. కానీ రూమర్స్ ఎప్పుడో వచ్చి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు వాటికి క్లారిటీ ఇస్తే మాత్రం ఇక వారి గురించి పూర్తిస్థాయిలో ఆ బ్యాడ్ రూమర్ వైరల్ అవుతూనే ఉంటుంది.. అందుకే మోహన్ కూడా ఎప్పటికప్పుడు వీటిపై స్పందించాలి అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే తనకు ఎయిడ్స్ అంటూ వచ్చిన రూమర్స్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు నటుడు మోహన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు