Actor Pradeep: 14 నంది అవార్డులు.. 15వేల కుటుంబాలకు ఉపాధి..!

Actor Pradeep.. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్రాంజేస్ మూవీ ఎఫ్ 2, ఎఫ్ 3.. ఇందులో హీరోయిన్లుగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటించారు. వై.విజయ, అన్నపూర్ణ, ప్రగతి, ప్రదీప్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఇక వీరందరూ కూడా నవ్వులతో పువ్వులు పూయించారు. ఇందులో అమాయకపు పాత్రలో నటించాడు సీనియర్ నటుడు ప్రదీప్.. “అంతేగా అంతేగా” అనే డైలాగ్ తప్ప మరో మాట మాట్లాడకుండా ఎఫ్2 , ఎఫ్3 సినిమాలో ఆ ఒక్క డైలాగ్ తోనే అందరికీ కితకితలు పెట్టించేశారు.ముఖ్యంగా ఈ కాలం తరానికి ప్రదీప్ అనగానే ఈ రెండు చిత్రాలే గుర్తుకొస్తాయి..

Actor Pradeep: 14 Nandi awards.. Actor who became lucky for stars..!
Actor Pradeep: 14 Nandi awards.. Actor who became lucky for stars..!

అప్పట్లోనే రోజుకు 500 ప్రేమలేఖలు..

నిజానికి ఈయన ఒక సీనియర్ నటుడు అని మాత్రమే తెలుసు.. కానీ ఆయన ఒకప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు కలల రాకుమారుడు కూడా.. ఇలాంటి వ్యక్తి భర్తగా రావాలనుకున్న అమ్మాయిలు చాలామంది.. అప్పట్లో ఈయనకి రోజుకు 500 ప్రేమలేఖలు కూడా వచ్చేవట.. దీన్ని బట్టి చూస్తే ఎలాంటిదో మనకు ఇట్టే అర్థమవుతుంది.. ముఖ్యంగా హాస్యబ్రహ్మ జంధ్యాల పరిచయం చేసిన నటులలో ప్రదీప్ కూడా ఒకరు.. ముద్దమందారం సినిమాతో డ్రీమ్ బాయ్ గా మారిపోయిన ప్రదీప్.. నాలుగు స్తంభాలాట, మల్లె పందిరి , రెండు జెళ్ళ సీత వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించారు.. అనేక సీరియల్స్ లో కూడా చేశారు..

హీరో గానే కాదు నిర్మాత , డైరెక్టర్ కూడా..

హీరోగా వెండితెరను ఏలుతున్నప్పుడు.. చదువుకు ప్రాధాన్యత ఇచ్చి కష్టపడి చదివి సీఎం పూర్తి చేశారు.. అక్కడితో ఆగలేదు. పలు బుల్లితెర సీరియల్స్ కూడా నిర్మించాడు.. తెలుగులో మొదటి సీరియల్ కి ప్రొడ్యూసర్ , డైరెక్టర్ ఆయనే కావడం విశేషం..

- Advertisement -

15వేల కుటుంబాలకు ఉపాధి..

అంతేకాదు టెలివిజన్ రంగంలో ఏకంగా 14 నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రస్తుతం ఈయన సీరియల్స్ వల్ల ఇప్పుడు ఇండస్ట్రీలో 15 వేల కుటుంబాలకు ఉపాధి కల్పించిన వ్యక్తిగా మారారు ప్రదీప్.

ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత.

అలా ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వారిలో ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల, బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఉత్తేజ్ ఇలా చాలామందిని ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు.. ఇకపోతే హీరోగా ఉంటే అక్కడే ఆగిపోవాల్సి వస్తుందని ఒక సంస్థను మొదలుపెట్టి.. కార్పొరేట్ ఫిలిం అడ్వర్టైజ్మెంట్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నారు. 1985 లోనే వ్యక్తిత్వం వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటో కూడా తెలియని రోజుల్లో ఆయన భార్యతో కలిసి ఏడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా పూర్తి చేశారు.. టైం లేదని చెప్పకుండా ఇప్పటికీ భార్యతో, కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీకి ఎంతో మందిని పరిచయం చేసి వారందరికీ లక్కీ హీరోగా మారిపోయారు ప్రదీప్.. ముఖ్యంగా హాస్య నటుడిగా మాత్రమే అందరికీ గుర్తుండి పోయినా మిస్టర్ పర్ఫెక్ట్ అనే పదానికి నిలువుటద్దం అని చెప్పడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు