Actor Ramyasri: ఇండస్ట్రీలో జరిగే బాగోతాలను బయటపెట్టిన నటి రమ్యశ్రీ..!

Actor Ramyasri.. అలనాటి సీనియర్ నటి రమ్యశ్రీ గురించి నేటితరం యువతకు పెద్దగా తెలియదని చెప్పాలి.. అప్పట్లో ఐటెం సాంగ్స్ లో .. వ్యాంప్ క్యారెక్టర్స్ లో నటించి తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా వ్యాంప్ పాత్రల్లో నటించేవారు అప్పట్లో చాలా తక్కువగా ఉండేవాళ్ళు.. ఒకవేళ ఎవరైనా నటించినా వారిపై విమర్శలు , సూటిపోటి మాటలు ఎక్కువగా వినిపించేవి.. అయితే వాటన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలిగిన అతి కొద్దిమంది నటులలో రమ్యశ్రీ కూడా ఒకరు. నువ్వు నేను, ఆది, సింహాద్రి, యమగోల మళ్ళీ మొదలైంది వంటి చిత్రాలలో రమ్యశ్రీ నటించగా.. మరి కొన్ని చిత్రాలలో సోలోగా హాఫ్ న్యూడ్ గా కూడా కనిపించి షాక్ ఇచ్చింది.. ఇక అందులో భాగంగానే ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్న ఈమె కొంతమంది కారులోనే బలవంతం చేశారని.. మరికొంతమంది వాడుకోవాలని చూశారని.. ఇలా తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యలపై వివరించింది రమ్యశ్రీ.

Actor Ramyasri: Actress Ramyasri revealed the good things happening in the industry..!
Actor Ramyasri: Actress Ramyasri revealed the good things happening in the industry..!

ఇండస్ట్రీ బాగోతాలని బయటపెట్టిన రమ్యశ్రీ..

ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్యశ్రీ మాట్లాడుతూ.. ఏదైనా ఈవెంట్ కి నన్ను పిలవాలంటే కూడా కొంతమంది ఎందుకు.. ఆమె చాలా అసభ్యకరంగా బట్టలు వేసుకుంటుంది అని విమర్శించేవారు.. అయితే నన్ను నమ్మి తీసుకున్న దర్శకులకు న్యాయం చేయాలి.. సినిమా బాగా రావాలంటే దర్శకుడు కోరినట్టే బట్టలు వేసుకోవాలి. అదే నేను చేశాను.. ఒకసారి అమెరికాలో ఈవెంట్ జరిగింది.. ఆ ఈవెంట్ కి ముందు నుంచి నన్ను పిలవాలని అనుకున్నారట.. కానీ కొంతమంది మాత్రం ఆమె బట్టలు దారుణంగా వేసుకుంటుంది వద్దు అని చెప్పినట్లు నా సన్నిహితులు నాతో చెప్పారు.. కొంతమంది ఇంకా బట్టలు ఏంటి ఇక్కడ మనం వేసుకోవడం లేదా అని సపోర్ట్ చేశారట.. మొత్తానికైతే నన్ను ఇన్వైట్ చేశారు.. ఆ ఈవెంట్ లో నా బిహేవియర్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. సినిమాలో అలా కనిపిస్తారు కానీ ఇక్కడ చాలా డీసెంట్ గా ఉన్నారు అని ప్రశంసించారు కూడా.. సినిమాల్లో అలా కనిపించినంత మాత్రాన బయట కూడా వాళ్ళ క్యారెక్టర్ అదే అని డిసైడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తోంది రమ్యశ్రీ.

చీర కట్టిన ప్రతి ఆడది పతివ్రత కాదు..

అయితే అదే ఈవెంట్లో చాలామంది కూర్చొని డిన్నర్ చేస్తున్నాము.. ఇంతలోనే ఒక పెద్దాయన లేచి.. చీర కట్టిన ప్రతి ఆడది పతివ్రత కాదు అని చెప్పాడు.. డ్రెస్ ని చూసి అంచనా వేయకూడదని చెప్పాడు.. అప్పుడు ఆ పెద్దాయన నన్ను ఉద్దేశించి చెప్పారని అందరికీ అర్థం అయిపోయింది. అప్పుడే నా గురించి అందరికీ తెలిసింది. అంటూ తెలిపింది రమ్యశ్రీ.

- Advertisement -

బ్లూ ఫిలిమ్స్ లో అవకాశం..

ఇక మరొక విషయం ఏమిటంటే.. నాకు బ్లూ ఫిలిమ్స్ లో కూడా అవకాశం వచ్చింది. చాలామంది నాపై ఒత్తిడి తెచ్చారు.. కానీ నేను చేయలేదు.. పైగా లాయర్ ని పెట్టుకొని మరీ వాదించాను.. అలాంటి వాటి జోలికి నేను వెళ్ళను.. కేవలం పొట్టకూటి కోసం డైరెక్టర్లు చెప్పారు.. కాబట్టి సినిమాలలో పొట్టి బట్టలు వేసుకుంటా.. అంతమాత్రాన ఇలాంటి పనులు చేయను అంటూ రమ్యశ్రీ తెలిపినట్టు స్పష్టం చేసింది. మొత్తానికి అయితే తన బట్టల విషయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించింది రమ్యశ్రీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు