Sivaji : పోసాని వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్లు వేస్తున్న శివాజీ..!

Sivaji : తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో సినీ ఇండస్ట్రీ నుండి కూడా పలువురు సెలెబ్రిటీలు ఆయా పార్టీల నేతల తరపున ప్రచారం చేయడం మద్దతు ఇవ్వడం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ గా జూన్ 4వ తేదీన వెలువడిన పలితాలతో టిడిపి పార్టీ భారీ విజయం సాధించగా, అలాగే జనసేన కూడా తక్కువ స్థానాల్లో పోటీ చేసినా ఊహకందని విజయం సాధించింది. ఇక గత ప్రభుత్వం అనూహ్యంగా కేవలం 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సింది. ఇదిలా ఉండగా ఈ ఊహించని జయాపజయాలతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇందులో భాగంగా నిన్నమొన్నటివరకూ వైసిపి తరపున మాట్లాడినవారంతా ఇప్పుడు మౌనందాల్చగా.. నిన్నటివరకూ విన్నవారు ఇప్పుడు మైకులందుకుంటున్నారు! ఈ క్రమంలో తాజాగా సినీ శివాజీ స్పందించారు. ఇందులో భాగంగా పోసాని కృష్ణమురళి పై విరుచుకుపడ్డారు. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరుపున బలంగా మాట్లాడిన గొంతుల్లో ఒకటైన ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళిపై.. శివాజీ (Sivaji) ఘాటుగా విరుచుకుపడ్డారు.

Actor Sivaji Counter to Posani krishnamurali

ఆయన గురించి మాట్లాడడం అనవసరం కానీ?

ఇక తాజాగా శివాజీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఆయనేమన్నారంటే… ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి గురించి మాట్లాడే హక్కు తనకు లేదు కానీ… తన కులం గురించి మాట్లాడారు కాబట్టి స్పందిస్తున్నట్లు తెలిపారు! ఈ సందర్భంగా… “కులాల గురించి మాట్లాడటం తప్పని, ఇకపై ఆ పని మానుకుని మీ పని మీరు చేసుకోవాలని” పోసానికి శివాజీ హితవు పలికారు. “ఎందుకంటే… మీదగ్గర సంస్కారం ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది. మీకు బిడ్డలున్నారు. రేపు నేను పోయినా కూడా ఫలానా వాళ్ల బిడ్డలు అని అంటే గౌరవం పెరుగుతుంది కానీ. పలానా వాళ్ల బిడ్డ అంటే గౌరవం తగ్గేలా చేసుకొవద్దన్నట్లుగా” శివాజీ సూచించారు. ఇక ఇదే క్రమంలో… “చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని తప్పులు మాట్లాడారు పోసాని గారూ?” అని ప్రశ్నించిన శివాజీ… “1998లో ఈనాడు పత్రికలో చంద్రబాబు గురించి పెద్ద ప్రకటన ఇచ్చిన పోసాని.. అప్పటి చంద్రబాబుకూ, ఇప్పటి చంద్రబాబుకూ ఉన్న తేడా ఏమిటి” అని ప్రశ్నించారు. “చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేశారు.. బడుగు బలహీనవర్గాలను రాజ్యాధికారంలోకి తీసుకురావాలనే పనిని కంటిన్యూ చేశారు” అని అన్నారు.

- Advertisement -

త్వరలో సినిమాలతో బిజీ కాబోతున్న శివాజీ..

అలాగే శివాజీ (Sivaji) పోసానికి కౌంటర్ వేస్తూ.. పెద్ద రచయిత మీరు.. వందలాది సినిమాలు చేశారు. ఎంతసేపు సర్.. వాళ్లు ఇప్పుడు మనల్ని తన్నడానికి”.. ఇప్పుడైనా మారండి.. అని అన్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారుతుంది. ఇకపోతే పోసాని రాజకీయాల వల్ల సినిమాలకు చాలా దూరమవగా, ఇప్పుడు ఎన్నికల హడావుడి అయిపోయింది కాబట్టి, మళ్ళీ సినిమాలు చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక శివాజీ ఈ లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ తో మళ్ళీ ఫామ్ లోకి రాగా, 90స్ కిడ్స్ అనే వెబ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. త్వరలో సినిమాల్లో బిజీ అవుతున్నాడని సమచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు