Sriram: ఇలియానా, త్రిషపై అలాంటి కామెంట్స్ చేసిన శ్రీ రామ్..!

తెలుగు ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేక.. ఫేడ్ అవుట్ హీరోగా మిగిలిపోతున్నారు. అలాంటి వాటిలో హీరో శ్రీకాంత్ (శ్రీరామ్) కూడా ఒకరు.. రోజా పూలు, ఒకరినొకరు తదితర చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. అయినప్పటికీ కూడా అడపా దడపా తెలుగు సినిమాలలో నటిస్తున్న శ్రీరామ్ ఈ మధ్యనే పిండం అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. హీరోగా, సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటిస్తున్న శ్రీరామ్ తాజాగా దావత్ అనే ఒక షోలో పాల్గొన్నారు.

ఈ షోలో తన వ్యక్తిగత విషయాలను.. తన సినీ జీవితంలో జరిగిన విషయాలను సైతం వెల్లడించారు.. ముఖ్యంగా హీరోయిన్స్ గురించి కొన్ని విషయాలను తెలిపారు శ్రీరామ్ .. అలాగే తన భార్య వందన గురించి కూడా తెలిపారు.. అక్కడ యాంకర్ మీ భార్య మీ కన్నా అందంగా ఉంటుంది కదా.. మీకు ఎప్పుడైనా ఆమె పైన అసూయ కలిగిందా? అని ప్రశ్నించగా.. అందుకు శ్రీరామ్ మాట్లాడుతూ.. అలా ఏం లేదు…నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటానని అలాంటి అందమైన అమ్మాయి ప్రేమ పొందినందుకు.. కానీ కొంతమంది తనని చూసి కుళ్లుకుంటారని తెలిపారు.

ఇక అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలను తెలిపారు.. మీరు ఎవరినైనా చూసి ఓరి దీని వేషాలో అని అనాలనిపించిందా అంటూ అడగగా..ఇలియానాను చూసినప్పుడు అలా అనిపించింది అంటూ.. స్నేహితుడు సినిమా సమయంలో.. అందరికీ 7:00 కి షూటింగ్ టైమ్ అయితే విజయ్ మాత్రం అరగంట ముందే ఉండేవారు.. కానీ ఇలియానా మాత్రం 11:00 గంటలకు వచ్చేది అంటూ తెలిపారు. అలా లేట్ గా లొకేషన్ కి వచ్చినప్పటికీ కూడా.. ఇంకో అరగంట తన హెయిర్ ని అడ్జస్ట్ చేయడానికి ఆమె చుట్టూ నలుగురు తిరుగుతూ ఉంటారు.. ఇక ఈమె ఓవర్ చూసి ఓసినీ.. ఏందిరా దీని వేషాలు అని అనుకున్నట్లు చెప్పుకొచ్చారు.

- Advertisement -

త్రిష గురించి మాట్లాడుతూ.. నాకు త్రిష బాగా క్లోజ్ ఫ్రెండ్… అయితే వందన నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాము అప్పుడు..వందన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని తెలిసి.. త్రిష వందన దగ్గరకు వెళ్ళి..వీడో పెద్ద వేస్ట్ గాడు.. ఇంగ్లీషు రాదు.. చదువు రాదు.. వీడితో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు అని చెబుతూ ఉండేది..నాకు తను ఒక ఫ్రెండ్ అయి ఉండి కూడా నా పెళ్లిని చెడగొట్టాలని చూసింది అంటూ శ్రీరామ్ తెలియజేశారు..

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు