Subhalekha Sudhakar: నా ఫ్యామిలీ నాశనం అవ్వడానికి కారణం అదే..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో శుభలేఖ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు నటుడు శుభలేఖ సుధాకర్.. ఎన్నో చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి .. తిరుగులేని నటుడుగా పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం చెల్లెలు ఎస్పీ శైలజ ను వివాహం చేసుకున్న విషయం తెలిసినదే.. హీరోగా కూడా పలు సినిమాలలో నటించారు. ఇటీవల విడుదలైన యాత్ర-2 చిత్రంలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించారు.

ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన శుభలేఖ సుధాకర్ యూట్యూబ్లో వచ్చిన కొన్ని ఫేక్ వీడియోల వల్ల తన కుటుంబం చాలా ఇబ్బందులను ఎదుర్కొందంటూ తెలిపారు.. 33 సంవత్సరాలుగా తాను శైలజ విడిపోయామని సోషల్ మీడియాలో వార్తలు రాస్తున్నారంటూ తెలిపారు.. ఈ విషయం పైన ఇద్దరం పక్కపక్కనే కూర్చుని క్లారిటీ కూడా ఇచ్చామని తెలియజేశారు.. కానీ అయినప్పటికీ ఇప్పటికీ అదే రాతలు అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయంటూ శుభలేఖ సుధాకర్ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ఒకానొక సందర్భంలో నా తల్లి ఈ విషయాలు చూసి.. నువ్వు శైలజా బాగానే ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని చెప్పినా.. ఆ ఆవేదనతో మరుసటి రోజే నా తల్లి కూడా మరణించింది. నా తల్లి మరణానికి కారణం యూట్యూబ్లో పెట్టిన రాతల వల్లే .. ఆ అనుమానం పెట్టుకొని చనిపోయింది. ఆ బాధ ఇప్పటికీ నాలోనే ఉందంటూ సుధాకర్ వెల్లడించారు.. సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఫేక్ వార్తలు నా భార్య పైన..నా పైన పెద్దగా ప్రభావం చూపించకపోయినా.. నా కుటుంబ సభ్యుల పైన ప్రభావం చూపించాయి కదా అంటూ తెలిపారు.

- Advertisement -

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించిన సందర్భంలో కూడా చిరంజీవి తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ రాశారని.. వాస్తవానికి 54 రోజులపాటు ప్రతిరోజు చిరంజీవి తనకు ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం యొక్క ఆరోగ్య పరిస్థితిని రోజు తెలుసుకునేవారు అంటూ తెలిపారు.. ఈమధ్య సోషల్ మీడియాలో కూడా తాను చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయని ఇలాంటి వార్తలు రాయడం వల్ల వారికి ఏం వస్తుందో అంటూ సుధాకర్ ప్రశ్నించారు.. ఒళ్ళు అమ్ముకొని బ్రతికే స్త్రీలకు కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. అంతకంటే దారుణమైన పరిస్థితులలో ఈ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు