Actors Become Politicians : ఇటు వెండితెర – అటు ప్రజాక్షేత్రం.. విక్టరీ కొట్టిన సెలబ్రిటీస్..!

సినిమాలలో ప్రేక్షకుల ను మెప్పించి రాజకీయాలలో ప్రజల మన్ననలు పొందిన సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. ఈ 2024 ఎన్నికలలో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైతే.. బాలకృష్ణ ఏకంగా హిందూపురం నుంచి హ్యాట్రిక్ అందుకోవడం సంచలనంగా మారింది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు ఎవరెవరు సెలబ్రిటీలు రాజకీయాలలోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి సత్తా చాటారో ఇప్పుడు చూద్దాం..

సీనియర్ ఎన్టీఆర్..

Actors Become Politicians : Here is silver screen - here is Prajakshetra.. Celebrities who won victory..!
Actors Become Politicians : Here is silver screen – here is Prajakshetra.. Celebrities who won victory..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఒక వెలుగు వెలిగిన ఈయన తెలుగు సినిమా పరిశ్రమకు మూల స్తంభం లాంటి వారు. ఇక రాజకీయాల్లోకి రావాలనుకున్న ఈయన 1982 మార్చి 29 న తెలుగుదేశం పార్టీని స్థాపించి.. స్థాపించిన 9 నెలల్లో అనగా 1983 జనవరిలో జరిగిన ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు సీనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత మూడు దఫాలుగా ఏడు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు..

హరికృష్ణ:

Actors Become Politicians : Here is silver screen - here is Prajakshetra.. Celebrities who won victory..!
Actors Become Politicians : Here is silver screen – here is Prajakshetra.. Celebrities who won victory..!

రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు నందమూరి హరికృష్ణ. 2008 నుండి 2013 వరకు రాజ్యసభలో పార్లమెంటు సభ్యునిగా పనిచేసిన ఈయన.. అంతకుముందు 1996 నుంచి 1999 వరకు హిందూపూర్ నియోజకవర్గము నుండి ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుడిగా కూడా పనిచేశారు.

- Advertisement -

నందమూరి బాలకృష్ణ:

Actors Become Politicians : Here is silver screen - here is Prajakshetra.. Celebrities who won victory..!
Actors Become Politicians : Here is silver screen – here is Prajakshetra.. Celebrities who won victory..!

1982లో పార్టీ స్థాపించినప్పటి నుంచి బాలకృష్ణ ప్రతి ఎన్నికలలో ఎన్టీఆర్ , చంద్రబాబు కోసం ప్రచారం చేశారు.. కానీ ప్రత్యక్ష రాజకీయాలలోకి దిగలేదు. మొదటిసారి 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 16,196 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక తర్వాత 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా హిందూపురం నుంచి పోటీ చేసిన బాలకృష్ణ 18,028 ఓట్ల తేడాతో రెండోసారి విజయం సాధించారు.. ఇక అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం లో మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాడు.. ప్రస్తుతం 20 వేల ఓట్ల పైచిలుకు తేడాతో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు బాలకృష్ణ.

పవన్ కళ్యాణ్:

Actors Become Politicians : Here is silver screen - here is Prajakshetra.. Celebrities who won victory..!
Actors Become Politicians : Here is silver screen – here is Prajakshetra.. Celebrities who won victory..!

పవన్ కళ్యాణ్ 2008లోనే రాజకీయాల్లోకి ప్రవేశించాడు.. తన అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసినయిన ఆ తర్వాత 2011లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో.. ఆ పార్టీని విడిచి 2014 మార్చి 14 న జనసేన పార్టీని స్థాపించారు. అయితే ఆ సంవత్సరం పోటీ చేయకుండా 2019 సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక భీమవరం నియోజకవర్గం ఓడిపోయారు.. ఇక ఈసారి కూటమితో పొత్తు పెట్టుకుని పిఠాపురం నుంచి పోటీ చేయగా 69 వేల ఓట్లకు పైగా మెజారిటీతో అఖండ విజయం సాధించి.. ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్.

చిరంజీవి:

Actors Become Politicians : Here is silver screen - here is Prajakshetra.. Celebrities who won victory..!
Actors Become Politicians : Here is silver screen – here is Prajakshetra.. Celebrities who won victory..!

2008 ఆగస్టు 26న ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి.. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి పాలకొల్లు , తిరుపతి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా.. తిరుపతి నుంచి గెలిచి పాలకొల్లులో ఓడిపోయారు.. ఆ తర్వాత 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది.. కేంద్ర పర్యాటక మంత్రిగా స్వతంత్ర హోదాలో విధులు నిర్వహించారు. ఇక ఆ తర్వాత రాజకీయాలలకు స్వస్తి పలికి ఖైదీ నంబర్ 150 సినిమాతో మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి.

రోజా:

Actors Become Politicians : Here is silver screen - here is Prajakshetra.. Celebrities who won victory..!
Actors Become Politicians : Here is silver screen – here is Prajakshetra.. Celebrities who won victory..!

సినీ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రోజా కన్నడ, తమిళ్, మలయాళం భాషలో 100కు పైగా సినిమాలలో నటించింది. రాజకీయాలలోకి అడుగుపెట్టిన ఈమె 2004 , 2009 శాసనసభ ఎన్నికల్లో నగరి చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఈ 2014 శాసనసభ ఎన్నికల్లో మరొకసారి నగరి నియోజక వర్గం నుంచి పోటీ చేసి సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు పై 858 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఇక 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి , 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ఏప్రిల్ 13న పదవీ బాధ్యతలు చేపట్టింది. అయితే ఈసారి కూడా మళ్లీ నగరి నుంచి పోటీ చేసిన ఈమె ఓటమిపాలైంది.

బాబు మోహన్:

Actors Become Politicians : Here is silver screen - here is Prajakshetra.. Celebrities who won victory..!
Actors Become Politicians : Here is silver screen – here is Prajakshetra.. Celebrities who won victory..!

సీనియర్ ఎన్టీఆర్ కి చిన్నప్పటి నుంచి వీరాభిమాని.. అదే అభిమానంతోనే తెలుగుదేశం పార్టీలో చేరారు.. ప్రముఖ హాస్య నటులు బాబు మోహన్.. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికయి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004 , 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టిఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందిన ఈయన.. 2018లో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరి 2023 లో బిజెపి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ చేతిలో ఓడిపోయారు. 2023 ఫిబ్రవరి 7న బిజెపికి రాజీనామా చేసి అదే ఏడాది మార్చి 4న ప్రజాశాంతి పార్టీలో చేరారు.

మురళీమోహన్:

Actors Become Politicians : Here is silver screen - here is Prajakshetra.. Celebrities who won victory..!
Actors Become Politicians : Here is silver screen – here is Prajakshetra.. Celebrities who won victory..!

తెలుగుదేశం పార్టీలో చేరిన మురళీమోహన్ 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణకుమార్ చేతిలో 2,147 ఓట్లు తేడాతో పరాజయం పాలయ్యాడు. తిరిగి 2014లో 16వ లోక్సభ ఎన్నికల్లో గెలిచి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు.

దాసరి నారాయణరావు:

Actors Become Politicians : Here is silver screen - here is Prajakshetra.. Celebrities who won victory..!
Actors Become Politicians : Here is silver screen – here is Prajakshetra.. Celebrities who won victory..!

రాజీవ్ గాంధీ పాలనా కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్సాహంగా ఎన్నికల్లో ప్రచారం సాగించిన దాసరి నారాయణరావు.. రాజీవ్ హత్య అనంతరం పార్టీకి దూరంగా జరిగారు.. 1990 దశకం చివరిలో తెలుగు తల్లి అనే ఒక రాజకీయ పార్టీని ప్రారంభించిన ఈయన.. ఆ పార్టీకి కోస్తా ప్రాంతంలోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు పోటీ చేసి ఎన్నికయ్యారు. బొగ్గు, గనుల శాఖకు కేంద్ర మంత్రిగా వ్యవహరించాడు కూడా..
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సన్నిహితుడు.. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు.

మోహన్ బాబు:

Actors Become Politicians : Here is silver screen - here is Prajakshetra.. Celebrities who won victory..!
Actors Become Politicians : Here is silver screen – here is Prajakshetra.. Celebrities who won victory..!

కలెక్షన్ కింగ్ గా సినిమాలలో చెరగని ముద్ర వేసుకున్న మోహన్ బాబు .. రాజకీయాలలోకి ప్రవేశించిన తర్వాత 1955 నుండి 2001 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు.

సూపర్ స్టార్ కృష్ణ:

Actors Become Politicians : Here is silver screen - here is Prajakshetra.. Celebrities who won victory..!
Actors Become Politicians : Here is silver screen – here is Prajakshetra.. Celebrities who won victory..!

తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో హంగులు దిద్దిన కృష్ణ.. ఎన్నో రికార్డులను సైతం సృష్టించారు. ఇక రాజకీయాల్లోకి రావాలనుకున్న సూపర్ స్టార్ కృష్ణ 1984లో రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కృష్ణ ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ సినిమాలు కూడా చేశారు.. ఆ సమయంలో ఎన్టీ రామారావు అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. 1989లో కృష్ణ కాంగ్రెస్ తరపున ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.. ఆ తర్వాత 1991 లోకసభ ఎన్నికల్లో గుంటూరు లోకసభ నియోజకవర్గం కోరుకున్నా.. తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీ చేయించింది. 31 వేల ఓట్ల పైచిలుకు తేడాతో అభ్యర్థి రామయ్య పై కృష్ణ ఓటమిపాలయ్యారు. ఇక అదే సమయంలో 1991లో తనకు అత్యంత సన్నిహితుడు, రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడం.. తాను కోరిన గుంటూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇవ్వకపోవడం.. ఏలూరులో ఓటమి చెందడం వంటి కారణాలతో కృష్ణ రాజకీయాల్లో పోటీ చేయడం విరమించుకున్నారు.. ఇక 2009 ఎన్నికల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్దతు అందించింది.. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు కృష్ణ కుటుంబ సభ్యులు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి వారసుడైన వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు.

జయప్రద:

Actors Become Politicians : Here is silver screen - here is Prajakshetra.. Celebrities who won victory..!
Actors Become Politicians : Here is silver screen – here is Prajakshetra.. Celebrities who won victory..!

రాంపూర్ నియోజకవర్గానికి చెందిన జయప్రద నందమూరి తారక రామారావు ఆహ్వానం మేరకు 1994 అక్టోబర్ 10న తెలుగుదేశం పార్టీలోకి చేరి రాజకీయ రంగ ప్రవేశం చేసింది.. ఆ తర్వాత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ యొక్క మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా పనిచేసిన ఈమె.. 1996 ఏప్రిల్ లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయింది.. ఆ తర్వాత అక్కడ కొన్ని గొడవలు రావడంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాది పార్టీ లో చేరి.. ఆంధ్ర నా జన్మభూమి కానీ ఉత్తరప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదంతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుండి 2014 మే 13న లోక్సభకు ఎన్నికయింది.

జయసుధ:

Actors Become Politicians : Here is silver screen - here is Prajakshetra.. Celebrities who won victory..!
Actors Become Politicians : Here is silver screen – here is Prajakshetra.. Celebrities who won victory..!

2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె.. ఆ తర్వాత టిడిపిలోకి చేరింది. అంతకుముందు 2018 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన.. 2023 ఆగస్టు 3న బిజెపి పార్టీ జాతీయ కార్యాలయంలో కేంద్ర మంత్రి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి , రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ సమక్షంలో బిజెపిలో చేరింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు