Anasuya : మొన్నేమో అలా.. ఇప్పుడు మళ్ళీ సెగలు పుట్టిస్తుందేంటి!

Anasuya : టాలీవుడ్ లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి నటిగా తెగ బిజీ అవుతున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పుడెప్పుడో టెలివిజన్ లో న్యూస్ ఛానల్ లో వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై ఫేమస్ అయింది. ఆ తర్వాత అలాంటి ఎంటర్టైన్మెంట్ షో లతో బిజీ అవుతూ, ఇప్పుడు సినిమాల్లోనూ బిజీ అయింది. ఇప్పుడు బుల్లితెరకు కూడా దూరమై పూర్తిగా సినిమాల పైనే ఫోకస్ చేసింది. క్షణం, రంగస్థలం, పుష్ప, రీసెంట్ గా రజాకార్ వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది అనసూయ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస అవకాశాలు అంటుకుంటూ అప్పుడప్పుడూ హాట్ ఫోజులతో నెట్టింట కూడా వైరల్ అవుతూ ఉంటుంది. అయితే ఈ అనసూయ సినిమాల కంటే వివాదాల తోనే ఎక్కువ ఫేమస్ అయిందని తెలిసిందే. ఇకపోతే ఎప్పుడూ గ్లామర్ షోలతో పోటోషూట్లతో హీటెక్కించే అనసూయ (Anasuya) తాజాగా అప్లోడ్ చేసిన మరికొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Actress Anasuya Latest Hot Photoshoots Wiral On Instagram

హీటెక్కించే అందాలతో సెగలు పుట్టిస్తుంది..

ఇక ఈటివి లో జబర్దస్త్ చేస్తున్నప్పటినుండే అనసూయ తన గ్లామర్ షో ఓ రేంజ్ లో చేసేది. ముఖ్యంగా అనసూయ ప్రతివారం చేసే గ్లామర్ విందు కోసమే ఈ షోను చూసేవాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉండేవాళ్లు. ఆ షో కోసం సూపర్ సెక్సీగా రెడీ అయ్యే క్రమంలో ఆ ఫొటోలనే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భారీగా అభిమాణుల్నీ సంపాదించుకుంది అనసూయ. ఇక ఇప్పుడు జబర్దస్త్ కు దూరమై, సినిమాల్లో బిజీ అయినా సరే.. అనసూయ తరచుగా సోషల్ మీడియా కుర్రకారులో సెగలు పుట్టిస్తూనే ఉంటుంది. ఈ మధ్యే ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లిన సందర్భంగా బికినీలో అనసూయ ఫొటోలు ఇంటర్నెట్‌ను వేడెక్కించిన సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా అనసూయ ఓ ప్రైవేటు ప్రోగ్రాంలో శారీ లుక్‌లో దర్శనమిచ్చిన తీరు చూసి తన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సూపర్ సెక్సీగా, హాట్‌గా కనిపిస్తున్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోయాయి. తాజాగా ఇంస్టాగ్రామ్ లో నీలి రంగు చీరతో, నీలి కళ్ళ సెట్ తో ఓ రేంజ్ లో మత్తెక్కిస్తోంది.

- Advertisement -

మొన్నేమో అలా? ఇప్పుడిలా?

అయితే ఎప్పుడూ సోషల్ మీడియా లో గ్లామర్ తో హీటెక్కించే అనసూయ, మొన్నామధ్య గగుళ్లో కూర్చుని పద్దతిగా ఫొటోలు అప్లోడ్ చేసి షాకిచ్చింది. ఏంటి అనసూయ నిజంగా సతీ అనసూయ అయిపోయిందా అంటూ నెటిజన్లు షాకయ్యారు. కొందరు అనసూయని ఇకనైనా అలాగే ఉండమని కితాబిచ్చారు. కానీ మూడు రోజులు కూడా గడవకముందే నెట్టింట మతిపోయే రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ ఫొటోలు అప్లోడ్ చేసింది. ఇక ప్రస్తుతం అనసూయ ‘పుష్ప-2’తో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె ఒక టీవీ ఛానెల్ కోసం ఒక కొత్త గేమ్‌ షోలోనూ పాల్గొంటోంది. ఇక ఇంస్టాగ్రామ్ లో వారానికి ఒక్క ఫోటోషూట్ తో అయినా వైరల్ అవుతుంది అనసూయ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు