Actress Ashwini: సినీ ఇండస్ట్రీలో గొప్ప గౌరవం.. కానీ అనాథలా మరణం..?

Actress Ashwini.. సినీ సెలబ్రిటీల జీవితం ఎప్పుడు? ఎలా? ఏ విధంగా? మలుపు తిరుగుతుందో చెప్పడం అసాధ్యం. ఇండస్ట్రీ లోకి ఏమీ లేకుండా వచ్చి వేల కోట్లకు అధిపతులైన వారు ఉంటే, ఇండస్ట్రీ లోకి వచ్చి బాగా సంపాదించిన తర్వాత ఒక గౌరవం దక్కించుకొని, ఆ తర్వాత అనాధలుగా మరణించిన వారు కూడా ఎంతో మందే ఉన్నారు. ఇకపోతే కొంతమంది కొన్ని చిత్రాలు చేసి ఆ తర్వాత చేయకపోయినా అభిమానుల గుండెల్లో చిరకాలంగా నిలిచిపోతారు.అందం, అభినయంతో మెప్పించిన కొందరు తారల వ్యక్తిగత జీవితాలు మాత్రం విషాదం గా ముగుస్తాయి.. అందులో అశ్విని కూడా ఒకరు.

Actress Ashwini: Great respect in the film industry.. but death like an orphan..?
Actress Ashwini: Great respect in the film industry.. but death like an orphan..?

సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవమానాలు, సవాళ్లు, కష్టాలు ఎన్నో ఎదుర్కొని అవకాశాలను సొంతం చేసుకుని, ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగు స్టార్ హీరోల అందరి సరసన నటించిన అశ్విని 1990లోనే తెలుగులో నటించడం మానేసింది. ఆ తర్వాత తమిళ సినిమాలకే పరిమితమైన ఈమె తెలుగువారిని ఆకట్టుకోవడం పూర్తిగా మరిచిపోయిందనే చెప్పాలి. నెల్లూరు జిల్లాలో పుట్టిన ఈ అచ్చ తెలుగమ్మాయి అశ్విని చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, ఆ తర్వాత హీరోయిన్ గా అడుగుపెట్టింది. సుమారు 100కు పైగా చిత్రాలలో నటించి మెప్పించింది. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో గొప్ప గౌరవాన్ని అందుకున్న ఈమె చివరికి అనాథలా మరణించింది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు..100 కి పైగా చిత్రాలు..

1967 జూలై 14 వ తేదీన పుట్టిన అశ్విని సీనియర్ నటి భానుమతి తీసిన భక్త ధ్రువ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. తర్వాత చదువులపై దృష్టి పెట్టి కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా ఈమె.. ఇంటర్ చదువుతున్న సమయంలో ఒక తమిళ సినిమాలో ఆఫర్ రావడంతో హీరోయిన్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఫస్ట్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ అవడంతో తెలుగు, తమిళ్ భాషలలో వరుస అవకాశాలు వచ్చాయి. అనాదిగా ఆడది, అరణ్యకాండ, భలే తమ్ముడు, చూపులు కలిసిన శుభవేళ, కలియుగ పాండవులు, కొడుకు దిద్దిన కాపురం ఇలా ఎన్నో తెలుగు చిత్రాలలో నటించిన ఈమె తమిళ్, మలయాళం భాషల్లో కలుపుకొని వందకు పైగా చిత్రాలలో నటించింది.

- Advertisement -

అనాథ లా మరణం..

కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రముఖ రచయిత పువియరుసు మనవడిని రహస్యంగా వివాహం చేసుకుంది.. దాంతో వైవాహిక జీవితం కూడా సరిగ్గా సాగలేదని మానసిక ఒత్తిడికి గురైందని సమాచారం. ఒక బిడ్డను దత్తత తీసుకున్న ఈమె.. 2012లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది.. కానీ అనారోగ్య సమస్యల కారణంగా 2012 డిసెంబర్ 23న 45 సంవత్సరాల వయసులోనే అనాథగా మరణించింది ..అయితే ఈమెను తన స్వస్థలానికి తరలించడానికి డబ్బులు లేకపోవడంతో తమిళ స్టార్ హీరో పార్తీబన్ ఈమెకు సహాయం అందించారు. అయితే సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు అంతా కూడా వైవాహిక జీవితం వల్లే పోయింది అని , తన భర్త తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెట్టారని, అవి తట్టుకోలేక ఈమె మరణించిందని వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. 100కు పైగా చిత్రాలలో నటించి స్టార్ హోదా దక్కించుకొని చివరికి అనాథ లా మరణించడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు