Malayalam Actor: రేప్ చేశాడంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై నటి ఫిర్యాదు .. మలయాళ ఇండస్ట్రీలో మరో చర్చ..

Malayalam Actor: ఇటీవల ఫిలిం ఇండస్ట్రీలలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న ఓ ప్రొడ్యూసర్ తన గర్భవతిని చేశాడంటూ నటి ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో మరో కొత్త చర్చ వినిపిస్తుంది. మలయాళ సీనియర్ నటుడు సిద్ధిఖీ ( Siddikhi) తనను రేప్ చేశాడంటూ నటి రేవతి సంపత్ ( Revathi Sampath ) చేసిన ఆరోపణలు మాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపుతోన్నాయి. దీనిపై నెట్టింట దారుణమైన ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా సిద్ధిఖి భాద్యతలను నిర్వహిస్తున్నారు. అయితే సిద్ధిఖీ ట్రాప్ చేసి తనను రేప్ చేశాడంటూ రేవతి సంపత్ ఆరోపించింది. తనతో పాటు తన స్నేహితులను కూడా లైంగికంగా సిద్ధిఖీ వేధించాలంటూ రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలు మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ లైంగిక ఆరోపణల నేపథ్యంలో సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశాడు. ఆదివారం తన రాజీనామా లేఖను ప్రెసిడెంట్ మోహన్ లాల్‌( Mohan Lal ) కు అందజేశాడు..

సోషల్ మీడియా ద్వారా వీరిద్దరికీ పరిచయం..

వీరిద్దరూ అనుకోకుండా కలవలేదు. సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. నాకు నటనపై ఉన్న ఆసక్తిని గమనించిన సిద్ధిఖీ…తన సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని మభ్యపెడుతూ వచ్చాడు. సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన సుఖమయిరిక్కట్టే ప్రీమియర్ షోకు నన్ను ఆహ్వానించాడు. షో ముగిసిన తర్వాత నన్ను తిరువనంతపురంలోని మస్కట్ హోటల్‌కు తీసుకెళ్తాడు. అక్కడ తన పై లైంగిక దాడి చేసి మరి రేప్ చేసినట్లు ఆమె ఆరోపించింది. దీనిపై ప్రశ్నిస్తే తనను దారుణంగా కొట్టినట్లు ఆరోపించారు.. హోటల్‌లో ఉన్న గంట ఎంతో నరకం అనుభవించాను. అయితే ఎలాగో ఆ హోటల్‌ నుంచి తప్పించుకున్నాను. కానీ ఆ భయానక అనుభవం నుంచి బయటపడటానికి మాత్రం నాకు చాలా రోజులు పట్టిందని ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పింది..

- Advertisement -
Actress Complaint Against Movie Artist Association For Rape
Actress Complaint Against Movie Artist Association For Rape

ఇకపోతే సిద్ధిఖీపై రేవతి సంపత్ లైంగిక ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2021లో సిద్ధిఖీ, దర్శకుడు రాజేష్ టచ్‌రివర్‌తో పాటు మరికొందరు తనను వేధించారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.. ఆ పోస్టులో పేర్కొన్న పేర్లలో చాలా వరకు లాయర్లు, పోలీసులు ఉండటంతో ఆ పోస్ట్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. దీనిపై తాజాగా ఆమె గట్టిగా నిర్ణయించుకొని కంప్లైంట్ ఇచ్చింది.. ఈ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్ధిఖీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని తెలిపారు. నటి ఆరోపణలతో సిద్దిఖీపై పలువురు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆయన మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా తన పదవికి రాజీనామా చేశారు.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు