Actress Hema: నేను సాంప్రదాయిని కాదు.. నా లైఫ్ నా ఇష్టం.. నిజం ఒప్పుకున్నట్టేనా..?

Actress Hema.. ప్రముఖ నటి హేమ వరుస సినిమాలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు దక్కించుకుంది. అయితే సినిమాల ద్వారా ఎంత మంచి పేరు అయితే సొంతం చేసుకుందో.. ఆ ఇమేజ్ ను ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయి అంతా కోల్పోయింది. ఒక ప్రముఖ వ్యక్తి బెంగళూరు శివారులో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో తన బర్త్డే పార్టీ నిర్వహించారు. దీనికి 100 మందికి పైగా పాల్గొన్నారు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని ఎవరో సమాచారం ఇవ్వడంతో పోలీసులు పార్టీపై దాడి చేసి 80 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ పార్టీలో నటి హేమ కూడా ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

Actress Hema: I am not perfect.. I like my life.. Did you admit the truth?
Actress Hema: I am not perfect.. I like my life.. Did you admit the truth?

కండిషనల్ బెయిల్ మీద బయటకు వచ్చిన హేమ..

దీనికి తోడు వరుస కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ,తాను అక్కడ లేనని హైదరాబాదులో ఉన్నానని, బిర్యాని వండుతున్న వీడియోని కూడా షేర్ చేసింది హేమ. అయితే బెంగళూరులో జరిగిన పార్టీలో హేమా ఉన్నట్లు అక్కడి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ తో సహా బయటపెట్టారు. ఇక ఫలితంగా ఆమెకు నోటీసులు కూడా జారీ చేశారు. ఏడాది మే 19, 20 తారీకులలో ఆ పార్టీ నిర్వహించగా , పార్టీలో నిషేధిత MDMA పిల్స్ తోపాటు కొకైన్ ని కూడా వాడినట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. వీటిని సీజ్ చేసి విచారణకు హాజరైన హేమాకు పరీక్షలు నిర్వహించినట్లు అందులో ఆమెకు పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. జైలుకు వెళ్లిన ఈమె ఆ తర్వాత కండిషనల్ బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ మండిపడింది.

రేవ్ పార్టీకి వెళ్ళింది నిజమే..

ఇంటర్వ్యూలో భాగంగా.. హేమ బెంగళూరు పార్టీకి హాజరైనట్లు ఒప్పుకుంది. అయితే అది రేవు పార్టీ కాదని ఆమె తెలిపింది. అసలు రేవు పార్టీ అంటే ఏంటి అని హేమా యాంకర్ ను తిరిగి ప్రశ్నిస్తే.. డ్రగ్స్ తీసుకుంటారు బట్టలు లేకుండా ట్రాన్స్లో ఉంటారు అంటూ సమాధానం చెప్పారు. దీనికి హేమా మాట్లాడుతూ.. మీ అక్క హేమా అలా చేస్తుందంటే నువ్వు నమ్ముతావా? అని అడిగితే లేదని యాంకర్ సమాధానం ఇచ్చారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నేను శనివారం రోజు ఉన్నాను. కానీ ఆదివారం ఏం జరిగింది అనే విషయం నాకు తెలియదు.. నా తమ్ముడి లాంటి వ్యక్తి పుట్టినరోజు వేడుకలకు నన్ను పిలిస్తే వెళ్లాను..

- Advertisement -

నా జీవితం నా ఇష్టం..

నేను ఇంకా బ్లడ్ శాంపిల్స్ కూడా ఇవ్వలేదు కానీ ఒక మీడియా పాజిటివ్ వచ్చిందని ప్రచారం చేసింది. సాంప్రదాయని అంటూ నన్ను ఎగతాళి చేశారు.. అవును నేను సాంప్రదాయని కాదు.. ఎక్కడికైనా వెళ్తాను నా జీవితం నా ఇష్టం.. అడగడానికి మీరెవరు అసలు మీకు ఏం హక్కు ఉంది? అంటూ మండిపడింది హేమ. నేను ఎలాంటి తప్పు చేయలేదని , త్వరలోనే కోర్టు కూడా చెబుతుంది. కానీ కొంత సమయం పడుతుందంటూ తెలిపింది హేమ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు