Actress Hema: నా శవాన్ని కూడా వదిలేలా లేరు.. కన్నీటి పర్యంతం అవుతున్న హేమ..?

Actress Hema.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలోనైనా సరే నటించగలిగే నటీమణులలో నటి హేమా కూడా ఒకరు. ఈమె గతంలో ఎన్నో చిత్రాలలో తన కామెడీ టైమింగ్ తో , డైలాగులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అప్పట్లో మా ఎలక్షన్స్ సమయంలో ఈమె పేరు బాగా వినిపించింది. మళ్లీ ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీలో ఈమె పేరు ఎక్కువగా వినిపించడంతో మరొకసారి ఈమె పేరు వైరల్ గా మారింది.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమా ముక్కుసూటిగా మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది.

Actress Hema: I can't even leave my dead body.. Hema is in tears..?
Actress Hema: I can’t even leave my dead body.. Hema is in tears..?

మీడియా వల్ల కృంగిపోయాను..

హేమా మాట్లాడుతూ.. ముక్కు సూటి మనుషులు ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పు చేయరని, తాను కూడా అలాంటి దాన్నే అంటూ తెలియజేస్తోంది. అసలు బెంగళూరు రేవు పార్టీకి తాను వెళ్లలేదని కేవలం బర్తడే పార్టీకి మాత్రమే వెళ్లానంటూ తాజాగా ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే హేమా రేవు పార్టీ ఆదివారం జరగగా తాను శనివారం రోజున బర్తడే పార్టీకి వెళ్లి తిరిగి వచ్చేసానంటూ తెలియజేసింది.. అయితే తన నుంచి ఎలాంటి శాంపుల్స్ తీసుకోకుండానే పాజిటివ్ వచ్చాయని చాలామంది తప్పుడు కథనాలు కూడా ప్రచారం చేశారని కూడా ఎమోషనల్ గా మాట్లాడింది. ఈ విషయంలో మీడియానే తనని చాలా కృంగిపోయేలా చేసిందని తెలుపుతోంది హేమ.

నేనేమైనా టెర్రరిస్టునా..

ఇవే కాకుండా తన మీద బ్రేకింగ్ న్యూస్ అంటూ చాలానే రాశారు. నేనేమైనా ఒక టెర్రరిస్టునా.. ఎంతమందిని చంపేశాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది. గతంలో డైరెక్టర్ కూడా డ్రగ్స్ కేసులో చిక్కుకున్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆయనకే రానప్పుడు.. తనతో పాటు ఉన్న ఇద్దరు హీరోలు తన కూతుర్ని సైతం పంపించి తనకి ఏం కావాలో చూసుకున్నారని.. అలాగే మా అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు కూడా తనకు సపోర్టివ్ గా నిలిచారని .. తన స్నేహితులుకూడా తనని ఎవరూ వదిలిపెట్టలేదని తెలిపింది హేమ.

- Advertisement -

నా శవాన్ని కూడా వదిలి పెట్టేలా లేరు..

నేను వెళ్ళింది బర్తడే పార్టీకి మాత్రమే కేవలం నా తమ్ముడు లాంటి వాళ్లతో వెళ్లాను. రేపు మాకు కచ్చితంగా తీర్పు వచ్చినప్పుడు అందరికీ అసలు విషయం తెలుస్తుంది. నేను రేవు పార్టీకి వెళ్లాను.. డ్రగ్స్ తీసుకున్నానా లేదా అని అన్ని టెస్టులు చేయించుకున్నాను. కానీ అన్నిటిలో కూడా నెగిటివ్ గానే వచ్చింది. అవన్నీ కూడా మా అసోసియేషన్ వాళ్ళకి ఇచ్చాను అంటూ తెలిపింది హేమ.. తాను తప్పు చేయలేదని నమ్మారు. కాబట్టి తిరిగి మళ్లీ మా కార్డు కూడా ఇచ్చేసారని తెలిపింది. తన 35 ఏళ్ల సినీ కెరియర్లో ఇప్పటివరకు ఎలాంటి రిమార్కులేని నటిగా పేరు పొందాను. కానీ ఈ రోజున చాలామంది నన్ను ఒక టెర్రరిస్టు కంటే దారుణంగా పలు రకాలు మీడియా సంస్థలు చూపిస్తున్నారు. ఇవి చూసి తమ తల్లి ఒక వారం రోజులపాటు భోజనమే చేయలేదని.. అలా చూపించే వాళ్ళు మనుషులేనా అంటూ తెలిపారు.. తాను చనిపోయినా కూడా తన శవం మీద కూడా ఇలా తప్పుడు రాతలే రాస్తారు అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది హేమ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు