Mamaitha Baiju : ఆ డైరెక్టర్ నన్ను కొట్టనేలేదు – ప్రేమలు హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో సినిమాల చిత్రీకరణ సమయంలో పలువురు దర్శకులు అసహనానికి గురై పలువురు ఆర్టిస్టుల మీద అరవడం, కొన్నిసార్లు చేయి చేసుకోవడం గురించి గతంలో చాలా వార్తలు చూసే వాళ్ళం. ఇక ఇలాంటి వాటిలో ఎక్కువగా తెలుగులో తేజ, తమిళ్ లో బాలా వంటి దర్శకుల పేర్లు వింటూ ఉంటాం. కానీ తర్వాత రోజులు మారాయి. ఆర్టిస్టుల మీద ఏం అరిచినా ఆ న్యూస్ వైరల్ అయ్యి, మీడియాలో వీడియోల తో సహా తెలిసిపోతుంది. ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల దర్శకులు కూడా ఎందుకొచ్చిన సమస్యని పెద్దగా పట్టించుకోవట్లేదు.

ప్రేమలు హీరోయిన్ ని బాలా కొట్టాడా?

అయితే రీసెంట్ గా తమిళ సీనియర్ దర్శకుడు బాల.. ఓ హీరోయిన్ ని షూటింగ్ లో కొట్టినట్లు ఈ మధ్య బాగా వార్తలు వచ్చాయి. రీసెంట్ గా కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ హీరోగా బాల తెరకెక్కిస్తున్న ‘వంగమన్’ సినిమాకు ముందు మలయాళ అమ్మాయి, ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్‌గా ఎంపికైంది. కొన్ని రోజులు షూటింగ్ జరగింది. కానీ ఆమె మధ్యలో ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఇందుకు కారణం దర్శకుడు బాల ఆమెపై చేయిచేసుకోవడమే అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై తాజాగా మమిత బైజు స్పందించింది. లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ప్రేమలు’తో మంచి పాపులారిటీ సంపాదించిన మమిత తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూ లో బాల తో వివాదం గురించి స్పందించింది.

- Advertisement -

ఆయన నన్ను కొట్టనేలేదు..
మీడియా తో జరిగిన ఇంటర్వ్యూ లో హీరోయిన్ మమిత బైజు దర్శకుడు బాలా గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ ఇలా అంది. రీసెంట్ గా ‘‘మీడియాలో నా గురించి వస్తున్నా వార్తలు నిజం కాదు. దర్శకుడు బాల గురించి నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. ఆయన దర్శకత్వం వహిస్తున్న “వనంగాన్” సినిమా కోసం నేను దాదాపు ఏడాది పాటు పని చేశాను. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కూడా భాగమయ్యాను. కానీ ఆ సినిమా ఆలస్యం అవుతుండటంతో, తనకున్న ఇతర సినిమాల కమిట్మెంట్ల వల్ల దూరం కావాల్సి వచ్చిందని, అంతకుమించి ఏమీ జరగలేదని చెప్పుకొచ్చింది. అలాగే డైరెక్టర్ బాల గారు సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి అని, ఆయన వల్ల తాను ఏ రకంగానూ ఇబ్బంది పడలేదని, ఆయన తనని కొట్టారన్నది అవాస్తవం అని మమిత బైజు క్లారిటీ ఇచ్చేసింది.

అక్కడి నుండే స్ప్రెడ్ అయింది..

మమిత బైజు ప్రేమలు ప్రమోషన్ లో భాగంగా దాదాపు ఓ రెండు వారాల క్రితం ఆమె FM ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అక్కడి నుండి ఒక క్లిప్ వైరల్ అయ్యింది. అందులో దర్శకుడు బాలా వనంగాన్ చిత్రీకరణ సమయంలో తనను కొట్టాడని, ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగమని చెప్పినట్టు ఉంది. దీనిపై మమిత బైజు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా స్టేటస్ ద్వారా వివరణ ఇస్తూ, సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూ నుండి ఒక క్లిప్ కట్ చేసి, ఎడిట్ చేసి ఈ రకంగా, బాధ్యతారహితమైన హెడ్‌లైన్‌ని క్రియేట్ చేసి తప్పుగా చూపించారు అని మమిత బైజు చెప్పుకొచ్చింది. అలాగే ఇకనైనా ఇలాంటి తప్పుడు వార్తలను ఎండ్ చేయండి అంది. ఇక ప్రేమలు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ కి తెలుగులో ఇప్పట్నుంచే డిమాండ్ మొదలైందని వార్తలు వస్తున్నాయి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు