Happy Birthday Manjima : బ్రేక్ తీసుకున్నట్లేనా.?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలామంది హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తారు. కానీ అందరూ లాంగ్ రన్ తో కొనసాగుతారని చెప్పలేము. కొందరికి మొదటి సినిమా హిట్ అయినా కూడా తర్వాత అవకాశాలు రావు. కొందరిది మొదటి సినిమా ఫెయిల్ అయినా కూడా వరుస అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయింది కానీ నేహా సినిమాకి అవకాశాలు లేకుండా పోయాయి.

అలానే రీసెంట్ డేస్ లో పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీంచింది శ్రీలీలా. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. కానీ శ్రీలీలాకి మాత్రం అవకాశాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలో కూడా నటించే అవకాశాన్ని సాధించుకుంది శ్రీలీలా. అందం అభినయం ఉన్న కూడా కొన్నిసార్లు సరైన అవకాశాలు కూడా రావు. అలాంటి హీరోయిన్ లో మంచి మంజిమ ఒకరిని చెప్పొచ్చు.

తెలుగులో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన సాహసమే శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మంజీమ మోహన్. కాకపోతే ఆ సినిమా తర్వాత మంజిమ ఇప్పటివరకు తెలుగులో సినిమాలను చేయలేదు. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో నారా భువనేశ్వరి పాత్రలో కనిపించింది.

- Advertisement -

మంజిమా మోహన్ తెలుగు కంటే ఎక్కువగా తమిళం, మలయాళ చిత్రాలలో నటించింది. కేరళ లోణి పలక్కాడ్ లో పుట్టిన ఆమె 1990ల చివర, 2000ల మొదట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. “ఓరు వడక్కన్ సెల్ఫి” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. జి. ప్రజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, వినీత్ శ్రీనివాసన్ స్క్రిప్టు రాసాడు. ఆమె రెండవ చిత్రం తమిళంలో “అచ్ఛం ఎంబదు మదమైయదా”. ఈ సినిమాని తెలుగులో సాహసం శ్వాసగా సాగిపోగా తెరకెక్కింది. ఈ సినిమాకి అవార్డుని కూడా అందుకుంది మంజిమా.

ఇకపోతే మంచి మా వ్యక్తిగత విషయానికి వస్తే దేవరట్టం సినిమాలో తనతో కలిసి నటించిన కోలీవుడ్ యువ హీరో గౌతమ్ కార్తీక్ ని ప్రేమించి 2022 నవంబరు 28న చెన్నైలోని ఒక హోటల్ లో వివాహం చేసుకుంది. గౌతమ్ కార్తీక్ సీనియర్ నటుడు కార్తీక్ కి సొంత తనయుడు.

ఇకపోతే మంజుమా ఇప్పుడు ప్రస్తుతం సినిమాలేవి చేయట్లేదు. ఈమెకు సంబంధించిన సినిమా అప్డేట్ కూడా ప్రస్తుతానికి లేవు. అయితే మంజుమ సినిమాలు చేయకుండా ఇంకా బ్రేక్ తీసుకుందా అని చాలామందికి ఆలోచన మొదలయ్యాయి. ఏదేమైనా పెళ్లి తర్వాత కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడితే సినిమాలు చూసి ఎంకరేజ్ చేయడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారని చెప్పొచ్చు.
మళ్లీ సినిమాలు చేసి అభిమానులను అలరించాలని కోరుకుంటూ ఫిల్మీపై తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు