Actress : పుట్టిన నాలుగు రోజులకే బిడ్డను చంపాలనుకున్న హీరోయిన్… ఇదెక్కడి రాక్షసత్వం తల్లీ ?

Actress : అమ్మ కావాలని తహతహలాడేవారు ఎంతోమంది ఉన్నారు. అమ్మదనంలోని కమ్మదనం అలాంటిది మరి. అంతేకాదు తల్లి కాకపోతే ఆడజన్మ సార్థకమే కాదు అనుకుంటారు ఎంతో మంది. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా పుట్టిన నాలుగు రోజులకే తన బిడ్డను చంపేయాలనుకుందట. పైగా ఈ విషయాన్ని భర్తతో కూడా చెప్పిందట. మరి ఆమెలో ఇంతటి రాక్షసత్వంతో కూడిన ఆలోచనలు ఎలా వచ్చాయి? ఇంతకీ ఆ బిడ్డ పరిస్థితి ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే…

షాకింగ్ విషయాన్ని బయట పెట్టిన హీరోయిన్

పాకిస్తాన్ నటి సర్వత్ గిలాని తన బిడ్డను తానే చంపాలనుకున్న షాకింగ్ విషయాన్ని తాజాగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను తల్లి అయిన తర్వాత తన నవజాత శిశువును చంపాలని గట్టిగా ఫిక్స్ అయిందట. ఈ నటి మాట్లాడుతూ నేను నాలుగు రోజుల తర్వాత ఆసుపత్రిలో నా బిడ్డను చూడగలిగాను. ఎందుకంటే నాకు తీవ్రమైన ఆపరేషన్ జరిగింది. అయితే బిడ్డకు పాలిస్తున్నప్పుడు ఆమె బాగా కష్టపడాల్సి వచ్చింది. అలాగే నేను కూడా కష్టపడుతున్నాను. అప్పుడే ఆ బిడ్డను చంపేయాలని అనిపించింది. ఆ బిడ్డను పారేస్తే టెన్షన్ అంతా తీరిపోతుందని అనుకున్నాను. కానీ గదిలోకి వెళ్ళగానే నాకు ఆ పని చేయడానికి మనసొప్పలేదు. పైగా విపరీతంగా ఏడుపొచ్చింది. ఈ విషయాన్ని నా భర్త ఫహాద్ కి చెప్పాను. నేను మన బిడ్డను చంపాలి అనుకుంటున్నాను అని చెప్పగానే ఆయన నా పరిస్థితిని అర్థం చేసుకుని, నాకు ఎందుకు అలా అన్పిస్తుందో వివరించారు అంటూ స్వయంగా అసలేం జరిగింది అనే విషయాన్ని వెల్లడించింది.

Sarwat Gilani gets honest about postpartum depression

- Advertisement -

ఎందుకు చంపాలి అనుకుంది?

సాధారణంగా తల్లులు పిల్లల్ని చంపాలని అంత కలలో కూడా ఊహించరు. కానీ ఈ హీరోయిన్ మాత్రం ఎందుకు అలా చేసిందంటే ప్రసవానంతరం డిప్రెషన్ వల్ల అలా బిహేవ్ చేసిందట. ఇదే విషయాన్ని ఆమె భర్త ఫహద్ ఈ నటికి వివరించారట. ఇది జస్ట్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, ఇబ్బంది ఏమీ లేదు.. ఈ ఫీలింగ్ ఎప్పటికీ ఇలాగే ఉండదు అని సర్ది చెప్పారట.

ఇక ఈ పాక్ నటి ప్రసవానంతర డిప్రెషన్ గురించి మాట్లాడుతూ ప్రజల్లో దీని గురించి అవగాహన ముఖ్యమని చెప్పుకొచ్చారు. తల్లి అయిన తర్వాత ఇలాంటి విచిత్రమైన భావాలు ఉంటే అది మీరు కాదు మీ మానసిక పరిస్థితి మాత్రమే అని తెలుసుకోవాలని వివరించింది. లేదంటే ఇలా డిప్రెషన్ లో ఏదేదో చేసి కోలుకున్నాక తెలుసుకుంటే.. ఒక తల్లిగా ఉండి ఇలా ఎలా చేయగలిగాను అని గిల్టీగా ఫీల్ అవుతారని, తన లాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని స్పష్టం చేసింది. తాజాగా గిలానీ బయట పెట్టిన విషయాలు ఇప్పుడు చర్చకు దారి తీశాయి. ఇదిలా ఉండగా ఈ బ్యూటీ 2014లో కాస్మటాలజీ సర్జన్, నటుడు ఫహాద్ మీర్జాను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ నటి పలు సినిమాలతో పాటు టీవీ షోలలో కూడా నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు