Actress : ఈ స్టార్ హీరోయిన్ నటి కాకపోయి ఉంటే టీ అమ్ముకునేదని తెలుసా?

Actress : సాధారణంగా హీరోయిన్లు  సినిమాపై ఎంతో ప్యాషన్ తో వర్క్ చేస్తారు. సినిమా అనేది లేకపోతే తాము కూడా లేము అన్నంతగా మూవీస్ ని ప్రేమిస్తారు. అందుకే అవకాశాలు రాకపోతే అల్లాడిపోతారు. కానీ కొంతమంది మాత్రమే సినిమా కాకపోతే ఇంకేమైనా చేసి బతకగలం అనే ధైర్యంతో ఉంటారు. అలా ఓ హీరోయిన్ అయితే ఏకంగా సినిమాలు కాకపోతే టీ అమ్ముకుని బతికేదాన్ని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ హీరోయిన్ ఎవరంటే?

టీ అమ్ముకుని బతికేదాన్ని..

పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా ‘తంగలాన్’లో హీరోయిన్ గా నటించిన పార్వతి తిరువోరు అనే మలయాళ హీరోయిన్ ఈ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో మాళ‌విక మోహ‌న‌న్, పార్వ‌తి తిరువోతు హీరోయిన్లుగా న‌టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా వీరిద్ద‌రూ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మీరు న‌టి కాక‌పోయి ఉంటే ఏం అనే ప్రశ్న ఎదురు కాగా, ముందుగా పార్వతి స్పందిస్తూ న‌టిని కాక‌పోయి ఉంటే టీ అమ్ముకునేదాన్ని అంటూ బాంబ్ పేల్చింది. అయితే వృత్తి ఏదైనా గౌర‌వంతో పని చేయాల‌ని, అందుకే టీ షాప్ పెట్టుకోవాల‌ని అనుకున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది.

ఇక మ‌రో హీరోయిన్ అయిన మాళ‌విక మోహ‌న‌న్ త‌న‌కు విజువ‌ల్ ఆర్ట్స్ అంటే ఇష్టం కాబట్టి హీరోయిన్ కాకపోయి ఉంటే ఫోటోగ్ర‌ఫీ లేదా సినిమాటోగ్రఫీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. దీంతో వీరిద్దరూ చేసిన కామెంట్స్ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. కాగా తంగ‌లాన్ చిత్రాన్ని ఆగ‌స్టు 15న ప్ర‌పంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ సిద్ధం అవుతున్నారు.

- Advertisement -

ഇതാ തങ്കലാനിലെ ഗംഗമ്മ; പാർവതിക്ക് പിറന്നാൾ സമ്മാനമായി കാരക്‌ടർ പോസ്‌റ്റർ, ഒപ്പം ആശംസകളും - Parvathy Thiruvothu in thangalaan

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే

‘బెంగుళూరు డేస్’, ‘చార్లీ’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి పార్వతి తిరువోతు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా నటించింది. తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో పాపులర్ అయిన పార్వతి తెలుగులో ‘ధూత’ అనే వెబ్ సిరీస్‌ని కూడా చేసింది. అక్కినేని నాగ చైతన్య హిట్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది. ఇక ఇప్పుడు ఆమె చియాన్ విక్రమ్ భార్యగా తంగాలాన్ సినిమాలో కనిపించనుంది.

విక్రమ్ తో రొమాంటిక్ సీన్స్

ఈ సినిమా షూటింగ్‌లో తన అనుభవాల గురించి పార్వతి మాట్లాడుతూ.. ”సినిమాలో గంగమ్మ, తంగలాన్‌లు భార్యాభర్తలు. నా సహ నటుడితో సౌకర్యవంతమైన సంబంధం కలిగి ఉండటం నాకు ముఖ్యం. అప్పుడే మనం మన బాడీ లాంగ్వేజ్‌ని సరిగ్గా పొందగలము. కెమిస్ట్రీ న్యాచురల్ గా వర్కౌట్ అవుతుంది. నేను విక్రమ్‌లో సురక్షితమైన భాగస్వామిని కనుగొన్నాను. సహజంగానే స్త్రీగా ఒక మగాడు తాకినప్పుడు కొద్దిగా అసౌకర్యం ఉంటుంది. కానీ అలాంటి ఫీలింగ్ లేకుండా నేను చియాన్‌ను ఎంతగానో నమ్మగాలిగాను. విక్రమ్‌కి ఆ లోకంలో ఉండటమంటే చాలా ఇష్టం, నేనూ అలాగే చేశాను. కేవలం ఎమోషనల్ సన్నివేశాలకే కాదు, శారీరకంగా శ్రమించే సన్నివేశాల్లో కూడా అతను నాకు టిప్స్ ఇచ్చేవాడు’ అంటూ రొమాంటిక్ సీన్స్ ను ఎలా చిత్రీకరించారో వెల్లడించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు