Darshan Arrest : దర్శన్ అరెస్ట్ పై ఊహించని విధంగా స్పందించిన కన్నడ స్టార్ హీరోయిన్..!

Darshan Arrest : పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌ ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయడం కొన్ని రోజులుగా సౌత్ సినీ ఇండస్ట్రీలోనే హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకు సంబంధించిన కేసులో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తోపాటు నటి పవిత్ర గౌడ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ ప్రభావం కన్నడ ఇండస్ట్రీపై బాగా పడిందని చెప్పాలి. ఈ కేసుపై అటు దర్శన్ కి సపోర్ట్ చేయలేక, ఇటు మృతుడి వైపు మాట్లాడలేక తటస్థంగా నిలిచారు స్పందించినవారు. ఈ ఘటన పై కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోలపై రకరకాల విషయాలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక ఇప్పటివరకు, దివ్య స్పందన, రామ్ గోపాల్ వర్మ, ఉపేంద్ర మరియు కిచ్చా సుదీప్ వంటి వారు అందరూ ఈ హత్య కేసుపై తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇది గత కొన్ని రోజులుగా సినిమా వార్తలలో ఆధిపత్యం చెలాయిస్తోందని చెప్పాలి. ఖచ్చితంగా కన్నడ ఇండస్ట్రీని కొన్ని రోజులు కుదిపేస్తుందని అనిపిస్తుంది. ఇక జూన్ 11న హత్య కేసులో దర్శన్ (Darshan Arrest) ని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. రేణుకాస్వామి హత్యకేసులో ప్రమేయం ఉందంటూ సినీనటి పవిత్ర గౌడ తో పాటు దాదాపు 17 మందిని అరెస్టు చేశారు.

Actress Rachita Ram reacts on Darshan's arrest

దర్శన్ పై కన్నడ స్టార్ హీరోయిన్ రచితా రామ్ ఊహించని వ్యాఖ్యలు…

ఇక దర్శన్ అరెస్ట్ పై సినిమా ఇండస్ట్రీ లో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కన్నడ నటి స్టార్ హీరోయిన్ రచితా రామ్‌ ఈ అరెస్ట్ వ్యవహారంపై ఊహించని విధంగా స్పందించింది. ట్విట్టర్ అకౌంట్ లో రచితా రామ్ స్పందిస్తూ… ఇలా రాసింది. “ధర్మో రక్షతి రక్షిత: ” … అంటూ రచితా రామ్ నటుడు దర్శన్ గురించి ఇలా రాసింది… ముందుగా ఒక సాధారణ పౌరురాలిగా తన స్పందనను అందరితో పంచుకుంది. ఆ ట్వీట్ లో రచితా రామ్ స్పందిస్తూ… “రేణుకాస్వామి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని అందించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా”. హత్య కేసులో సరైన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇక దర్శన్‌ గురించి మాట్లాడుతూ… “తనను పరిశ్రమకు పరిచయం చేసిన దర్శన్‌ తనకు గురువు లాంటి వారని చెప్పుకొచ్చింది. దర్శన్‌ తనకు ఎప్పుడూ ఇలాంటి పాజిటివ్‌ గా మార్గనిర్దేశం చేసేవారని, ఆయన హత్య కేసులో ఉన్నారంటే నమ్మశక్యం కావడం లేదని రచితా రామ్‌ చెప్పుకొచ్చింది. అలాగే పోలీసుల విచారణలో నిజానిజాలు బయటకు వస్తాయని, మీడియా ఈ కేసును ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా రిపోర్టు చేస్తుందని నమ్ముతున్నానని ఇన్‌గ్రామ్‌లో రాసుకొచ్చింది రచితా రామ్.

- Advertisement -

కేసు తీర్పు ఎప్పుడో?

ఇక రేణుక స్వామి అరెస్ట్ కేసులో నటీనటులు దర్శన్, పవిత్ర గౌడ సహా మొత్తం 17 మంది నిందితులు ఉండగా, కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇదిలా ఉండగా ఈ నిందితుల్లో ఒకరి తండ్రి కూడా రీసెంట్ గా గుండెపోటుతో చనిపోయాడు. తాజాగా దర్శన్ యొక్క మేనేజర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. ఇక ఈ కేసులో దర్శన్ గనుక తప్పు చేసాడని ప్రూవ్ అయితే యావజ్జీవ శిక్ష తప్పదని 7 నుండి 14 ఏళ్ళ వరకు శిక్ష పడుతుందని అంటున్నారు. మరి ఈ కేసులో ఒకదానికొకటి సంబంధం లేకుండా ఇప్పటికే మూడు చావులయ్యాయి. ఇక ఈ కేసు ఓ కొలిక్కొచ్చేది ఎన్నడో? తుది తీర్పు ఎప్పుడు వస్తుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు