Actress Rohini: లైంగిక వేధింపులపై మీడియాతో మాట్లాడకండి.. నటి షాకింగ్ కామెంట్స్..!

Actress Rohini : మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయంటూ హేమా కమిటీ నివేదిక సమర్పించింది. ఎప్పుడైతే హేమా కమిటీ నివేదిక బయటకు వచ్చిందో అప్పుడు చాలా మంది సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వస్తూ తమకు ఎదురైన ఇబ్బందుల గురించి మీడియాతో చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఒకపక్క సినీ పెద్దలు ఇండస్ట్రీలో మహిళలు తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వచ్చి చెప్పాలని కోరుతుంటే, ప్రముఖ నటి రోహిణి (Rohini) మాత్రం మీకు జరిగిన లైంగిక వేధింపుల గురించి మీడియాతో చెప్పకండి అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం…

Actress Rohini: Don't talk to the media about sexual harassment.. Actress shocking comments..!
Actress Rohini: Don’t talk to the media about sexual harassment.. Actress shocking comments..!

ఆడవారి జీవితాలలో హేమా కమిటీ వెలుగు నింపేనా..

మలయాళ ఇండస్ట్రీలో వేసిన హేమా కమిటీ లాగా అన్ని ఇండస్ట్రీలలో కమిటీ వేయాలి అని చాలా మంది స్టార్ హీరోయిన్లు కోరుతున్న నేపథ్యంలో, తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన నడిగర్ సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళ సినీ పరిశ్రమలో ఎదురవుతున్న చేదు అనుభవాల గురించి, వేధింపుల గురించి ఫిర్యాదు చేయడానికి నడిగర్ సంఘం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీకి నటి రోహిణి అధ్యక్షురాలిగా నియమించారు. 2019 నుంచి స్టార్ ఆర్గనైజేషన్ నడిగర్ సంఘంలో అంతర్గత కమిటీ పని చేస్తూ ఉండగా.. ఆ కమిటీలో సభ్యులు అంతా చురుకుగా పనిచేయడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

లైంగిక ఇబ్బందుల గురించి మీడియాతో చెప్పకండి..

ఈ నేపథ్యంలోనే గతవారం జరిగిన సమావేశంలో కమిటీ అధ్యక్షురాలు నటి రోహిణి కీలక నిర్ణయం తీసుకున్నట్లు కామెంట్లు చేశారు. మీడియా సమావేశంలో భాగంగా రోహిణి మాట్లాడుతూ.. మహిళలు సినీ ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పడానికి ముందుకు రావాలని తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నేరం రుజువు చేయబడితే కచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కూడా ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు ఐదు సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీ నుంచి నేరస్తులను నిషేధం చేస్తామని , ఐదు సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో వారికి ఎలాంటి అవకాశం కల్పించమని కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

- Advertisement -

తమిళ సినీ పరిశ్రమ గౌరవం కాపాడడమే ధ్యేయం..

ముఖ్యంగా ఈ కమిటీలో వచ్చే ఫిర్యాదులు నడిగర్ సంఘం ద్వారా సైబర్ పోలీసులకు పంపిస్తామని, వేధింపులను ఎదుర్కొన్నవారు ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేశామని తెలిపారు. ఎవరైతే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారో వారు ఫోన్ నెంబర్ లేదా ఈ – మెయిల్ ద్వారా పంపించాలని అందుకు తగిన ఏర్పాట్లు చేశామని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మీడియా ముందు మాట్లాడకుండా.. హోమ్ కమిటీకి ఫిర్యాదు చేయాలని కోరారు. సినీ పరిశ్రమ పరువు ప్రతిష్టలు కాపాడడమే ధ్యేయంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదిక సిద్ధం చేయగా.. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో కూడా ఇలాంటి కమిటీ వేస్తున్నట్లు స్పష్టం చేశారు సినీ పెద్దలు. ఏదేమైనా రోహిణి తీసుకున్న నిర్ణయానికి మిగతా ఇండస్ట్రీ వారు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు