Samantha: గతంలోనే ఆ తప్పులు చేశా..సమంత షాకింగ్‌ కామెంట్స్‌ !

Samanttha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చింది సమంత. తన అద్భుతమైన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో తన హవాను కొనసాగించింది.

ఇక సమంత తాను నటించిన మొదటి సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఇక వీరిద్దరూ చాలాకాలం పాటు వారి ప్రేమను రహస్యంగా కొనసాగించారు. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి అంగరంగ వైభవంగా వివాహాన్ని జరిపించుకున్నారు. కొన్నేళ్లపాటు చాలా సంతోషంగా ఉన్న ఈ జంట ఏమైందో తెలియదు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల అనంతరం సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడింది.

ఆ వ్యాధి నుంచి కోలుకునేందుకు సమంత నానా కష్టాలు పడింది. కొన్ని రోజులపాటు సినిమాలకు దూరంగా ఉండి చికిత్స తీసుకొని ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటున్న సమంత వరుస పెట్టి మళ్ళీ సినిమాల్లో నటిస్తోంది. అయితే తనకి మయోసైటీస్ వచ్చిన విషయం ఎప్పుడో తెలుసని… కానీ తన ఆరోగ్యం గురించి సమంత పట్టించుకోలేదని సమంత స్నేహితురాలు తాజాగా వెల్లడించింది.

- Advertisement -

samantha-Samantha Ruth Prabhu shares glimpses of her daily life featuring diet

ఆ వ్యాధి వచ్చినప్పటికీ సరైన ఫుడ్ తీసుకోకుండా, షూటింగ్ పనుల్లో బిజీగా ఉండేదని…. అప్పుడే తాను సరిగ్గా ఆరోగ్యంపై దృష్టి పెట్టి, ట్రీట్మెంట్ తీసుకుంటే సమంత పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదని…. ఇక మాయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత సమంత తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెడుతోందని, అంతేకాకుండా మంచి ఫుడ్ తీసుకుంటుందని తాజాగా సమంత స్నేహితురాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు