Actress Shobhana : రీ ఎంట్రీ తర్వాత శోభన జోరు..

Actress Shobhana : మలయాళ సీనియర్ నటి శోభన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 80స్ 90స్ లో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఓ వెలుగు వెలిగింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. నటనకు ప్రాధమ్యమిచ్చే పాత్రలు చేసే హీరోయిన్లలో ఈమె ఒకరు. అయితే 90వ దశకంలో కొత్త హీరోయిన్ల రాక తో ఈమె హవా తగ్గింది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైంది. అయితే తమిళ్, మలయాళంలో మాత్రం అప్పటికి వరుస సినిమాలు చేస్తూనే ఉంది. అయితే 20వ దశకం తర్వాత అక్కడ కూడా సినిమాలు చేయడం తగ్గించింది. అడపాదడపా అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు మాత్రమే చేసిన శోభన (Actress Shobhana) తన క్లాసికల్ డాన్స్ లైఫ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇదిలా ఉండగా రీసెంట్ గా పాన్ ఇండియా సినిమా కల్కి 2898AD తో గ్రాండ్ గా తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.

Actress Shobhana is doing successful films in re-entry

తెలుగులో గ్రాండ్ రీ ఎంట్రీ..

ఇక తెలుగులో ప్రభాస్ కల్కి సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది శోభన. అప్పుడెప్పుడో మోహన్ బాబు గేమ్ అనే సినిమాలో చివరగా నటించిన శోభన 18 ఏళ్ళ తర్వాత తెలుగులో కల్కి తో రీ ఎంట్రీ ఇవ్వగా, ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో తెలిసిందే. ఇక ఈ సినిమాలో మరియమ్మ అనే పాత్రలో నటించింది శోభన. సాఫ్ట్ గా చూపిస్తూనే ప్రీ క్లైమాక్స్ లో ఆ రోల్ ని పవర్ ఫుల్ చేసేస్తారు మేకర్స్. ఆడియన్స్ కి ఆ పాత్ర కూడా బాగా నచ్చింది. ఇక రీ ఎంట్రీ తర్వాత శోభన వరుస సినిమాలతో బిజీ అవుతుంది.

- Advertisement -

రీ ఎంట్రీ తరవాత శోభన జోరు..

అయితే కల్కి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన శోభనకి తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి. కాకపోతే ఆమె వెంటనే ఒకే చేయకుండా కథలు వింటుంది. త్వరలో తెలుగులో మరో బిగ్ ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక మలయాళం లో ఆమె నటించిన క్లాసిక్ ‘మణిచిత్రతాఝ’ రీ రిలీజ్ కూడా అవుతుంది. ఇక ప్రస్తుతం మలయాళంలో మోహన్ లాల్ నటిస్తున్న L360 లో శోభన కీలక పాత్రలో నటిస్తుండగా, తమిళ్ లో రజినీకాంత్ కూలీ సినిమాలో కూడా నటిస్తుంది.మరి రీ ఎంట్రీ తర్వాత శోభన ముందు ముందు తన హవా ఎలా చూపిస్తుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు