Simran : ఆ తెలుగు హీరోలపై సిమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Simran : ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 90స్ లో ఊపు ఊపిన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ నటించిన ఈమె, 20స్ లో కొత్త హీరోయిన్ల రాక తో హవా తగ్గిపోయింది. ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా నటించలేదు. రీసెంట్ గా మాధవన్ ‘రాకెట్రి సైన్స్’ సినిమాతో రీ రీఎంట్రీ ఇచ్చింది ఆ సీనియర్ హీరోయిన్. అయితే వరుసగా సినిమాల్లో నటించకుండా సెలెక్టీవ్ గా సినిమాలను చేస్తూ ఉంది. ఇక సిమ్రాన్ సీనియర్ హీరోయిన్లలో సౌందర్య, రమ్యకృష్ణ తర్వాత సౌత్ ఇండియా లో బాగా పాపులర్ అయిన భామ అని చెప్పాలి. ఈమె ఖాతాలో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, కలిసుందాం రా, నువ్వు వస్తావని వంటి బ్లాక్ బస్టర్ సినిమాలున్నాయి.

Actress Simran's interesting comments on Chiranjeevi and Balakrishna

ఐఫా అవార్డ్స్ లో మెరిసిన సిమ్రాన్…

ఇదిలా ఉండగా సిమ్రాన్ (Simran) లేటెస్ట్ గా ఐఫా 2024 అవార్డ్స్ ఫంక్షన్ లో సందడి చేసింది. అక్కడ ట్రెడిషనల్ చీరలో వచ్చి అందరిని ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా చాలా రోజుల తర్వాత సిమ్రాన్ మీడియాకు చిక్కడంతో తెలుగు మీడియా ఆమెను కవర్ చేసింది. ఇక అక్కడ సిమ్రాన్ తెలుగు హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సిమ్రాన్ తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ తెలుగు సినిమాలంటే చాలా ఇష్టమని… ఇక్కడి సినిమాలని మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చింది. అలాగే తెలుగులో తనకు బెస్ట్ కో స్టార్స్ దొరికారాని వాళ్ళతో నటించడం తనకు నీతో కలిసొచ్చిందని వ్యాఖ్యానించింది.

- Advertisement -

తెలుగులో నా ఫెవరేట్..

ఇక తెలుగు హీరోల గురించి ప్రస్తావిస్తూ, తెలుగులో తన ఫెవరేట్ కో స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ అని చెప్పుకొచ్చింది. అలాగే తెలుగులో తన ఫెవరేట్ సాంగ్ తాను పెర్ఫార్మ్ చేసిన ఆటకావాలా.. పాటకావాలా అనే సాంగ్ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే బాలయ్య తో నటించిన సమరసింహారెడ్డి లో చలిగా ఉందన్నాడే పాట కూడా ఎంతో ఇష్టమని, అలాగే తెలుగులో చిరు, బాలయ్య తన ఫెవరేట్ కో స్టార్స్ అని చెప్పుకొచ్చింది. ఇక తెలుగులో మళ్ళీ నటిస్తారా అంటూ మీడియా అడగగా… మంచి సినిమా వస్తే తప్పకుండా నటిస్తాను అని చెప్పుకొచ్చింది. అయితే తెలుగులో నాని ఆహా కళ్యాణం తర్వాత నటించలేదు సిమ్రాన్. మరి తెలుగులో మళ్ళీ ఎలాంటి సినిమాతో ఆడియన్స్ ని పలకరిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు