Actress Sreeleela Net Worth 2024: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వారిలో శ్రీ లీల ఒకరు. అమెరికాలో పెరిగిన ఈ బ్యూటీ.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. పెళ్లి సందడి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్ శ్రీ లీల… ఆ తర్వాత ధమాకా అనే సినిమాతో సక్సెస్ అందుకుంది.
వాస్తవానికి 2019 సంవత్సరంలో కిస్ అనే సినిమాలో నటించి కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్గా కనుల విందు చేసింది. ఆ తెలుగులోకి వచ్చేసింది ఈ బ్యూటీ. ఇక తెలుగులో ధమాకా తర్వాత… వరస ప్లాపులతో సతమతమవుతోంది. స్కంద,భగవంతు కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇలా అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. గుంటూరు కారం కాస్త పరవాలేదు అనిపించింది.
అయితే తాజాగా హీరోయిన్ శ్రీ లీల ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హీరోయిన్ శ్రీ లీల బ్యాంకు బ్యాలెన్స్ 10 కోట్ల వరకు ఉంటుందట. అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఈమె పేరు మీద బిల్డింగ్ లు ఉన్నాయని సమాచారం. అలాగే ఏపీలో వ్యవసాయ భూమి ఉన్నట్లు సమాచారం. ఇక శ్రీ లీల తల్లి పేరు పైన కొన్ని ఆస్తులు ఉన్నాయట. ఇక ఒక్కో సినిమాకు రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట శ్రీ లీల.