SrideviVijaykumar : నా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ‘ఈశ్వర్’ ఫస్ట్ సినిమా – శ్రీదేవి

SrideviVijaykumar : నారా రోహిత్ హీరోగా నటించిన కొత్త సినిమా “సుందరకాండ” (Sundarakanda). ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్ నారా రోహిత్ కి జంటగా నటించింది. ఈరోజు విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక టీజర్ రిలీజ్ తర్వాత చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక ఆ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ సహా నటీనటులు పాల్గొన్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ (SrideviVijaykumar) నారా రోహిత్ కి హీరోయిన్ గా నటిస్తుండగా, పెళ్లి తర్వాత సినిమాలు ఆపేసిన శ్రీదేవి, ఆల్మోస్ట్ పదేళ్ల తర్వాత హీరోయిన్ గా నటిస్తుందని చెప్పాలి. అయితే ఈ ప్రెస్ మీట్ లో ఓ ప్రశ్నకి శ్రీదేవి ఊహించని విధంగా స్పందించింది.

Actress Sridevi Vijaykumar About Eeshwar Movie Re Release

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఫస్ట్ సినిమా ఈశ్వర్ – శ్రీదేవి..

ఈ ప్రెస్ మీట్ లో ఓ విలేఖరి మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత మళ్ళీ నటిస్తున్నారు. అయితే త్వరలో మీరు నటించిన ఫస్ట్ సినిమా ఈశ్వర్ (Eeshwar ReRelease) మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది. మీ అభిప్రాయం ఏంటి అని అడగగా, దానికి శ్రీదేవి విజయ్ కుమార్ ఆసక్తికరంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. తాను హీరోయిన్ గా నటించిన ఫస్ట్ సినిమా ఈశ్వర్ కాబట్టి, ఆ సినిమా తనకి చాలా స్పెషల్ అని శ్రీదేవి విజయ్ కుమార్ చెప్పుకొచ్చింది. అలాగే అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించానని, కానీ హీరోయిన్ గా ఈశ్వర్ ఫస్ట్ సినిమా అంది. అయితే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈశ్వర్ రీ రిలీజ్ అవుతుందని తెలిసి చాలా హ్యాపీగా ఉందని, తెలుగులో తన సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ ఈశ్వర్ తన ఫస్ట్ సినిమాగా రిలీజ్ అవుతుందని చమత్కారంగా బదులిచ్చింది.

- Advertisement -

సెకండ్ ఇన్నింగ్స్ కలిసొస్తుందా?

ఇక హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ నటుడు విజయ్ కుమార్, అలాగే నటి మంజుల కూతురుగా ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన శ్రీదేవి విజయ్ కుమార్, ప్రభాస్ (Prabhas) ఈశ్వర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాగా, హీరోయిన్ గా అంతగా సక్సెస్ మాత్రం కాలేదు. వరుస పరాజయాల వల్ల పెద్దగా సినిమాలు చేయలేదు. అయితే పెళ్లి తర్వాత రీసెంట్ గా కొన్ని రియాలిటీ షోలకు జడ్జ్ గా వ్యవహరించిన శ్రీదేవి విజయ్ కుమార్, ఇప్పుడు మళ్ళీ సుందరకాండ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంది. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో తనకు ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు