Actress Sukanya: అందుకే విడాకులు.. ఆమె నా కూతురు కాదు..!

Actress Sukanya. అందం, అభినయం ఉన్నప్పటికీ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేక పోయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు.. అలాంటి వారిలో నటి సుకన్య కూడా ఒకరు.. మొదట ఈమె డైరెక్టర్ భారతీ రాజా డైరెక్షన్లో వచ్చిన పుదునెల్లు పుదునాత్తు అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. సుకన్య అసలు పేరు ఆర్తి దేవి.. కానీ సినిమాలలో సక్సెస్ కోసం ఈమె సుకన్యగా తన పేరును మార్చుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ భారతి రాజా ఈమె పేరును కూడా మార్చారట.

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ సుకన్య..

తెలుగులో కూడా ఎన్నో చిత్రాలలో నటించింది సుకన్య.. ముఖ్యంగా హీరోలకు తల్లి పాత్రలో కూడా అద్భుతంగా నటించింది. తమిళ్, మలయాళం లో కూడా ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో సుకన్య నటించింది. అయితే గత కొంతకాలంగా సుకన్య వెండితెర పైన పెద్దగా కనిపించలేదు.. గతంలో ఈమె వ్యభిచారం చేస్తూ కూడా పట్టుబడినట్లుగా వార్తలు వినిపించాయి. అప్పటినుంచి సినిమాలలో చాలా తక్కువగానే నటిస్తోంది. ప్రస్తుతం బుల్లితెర పైన ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుకన్య తన పర్సనల్ జీవితం గురించి తెలియజేసింది.

భర్త నుంచి కొద్ది రోజులకే డివోర్స్..

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒక అమ్మాయి ఫోటో నటి సుకన్య కూతురు అంటూ వైరల్ గా మారుతోంది..వివాహమైన కొద్ది నెలలకే తన భర్త నుంచి విడిపోయిన సుకన్యకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ ఈ ఫోటో చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఈ విషయంపై సుకన్యను ప్రశ్నించగా.. ఈ విషయం పైన సుకన్య మాట్లాడుతూ.. ఆ అమ్మాయి తన కూతురు కాదని .. తను కేవలం తన చెల్లెలు కూతురు అంటూ క్లారిటీ ఇచ్చింది. తాను కూడా ఆ ఫోటో చూశాను.. తను నా కూతురు కాదు నా చెల్లెలు కూతురు అంటూ తన ట్విట్టర్ నుంచి కూడా ఈ విషయాన్ని తెలియజేశానని తెలిపింది.

- Advertisement -

తన కూతురు కాదు చెల్లెలి కూతురు అంటూ క్లారిటీ..

Actress Sukanya: That's why the divorce.. She is not my daughter..!
Actress Sukanya: That’s why the divorce.. She is not my daughter..!

అయినప్పటికీ కూడా చాలామంది వ్యూస్ కోసం తన కూతురు అన్నట్లుగా రాస్తున్నారు.. శ్రీధర్ రాజగోపాల్ ని తను వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నానని.. కేవలం కొన్ని నెలలు మాత్రమే తాము కలిసి ఉన్నాము.. ఆ తర్వాత కోర్టు నుంచి విడాకులు తీసుకున్నామని తెలిపింది. అయితే ఆ ఫోటోలో ఉన్న తన చెల్లెలు కూతురు మాత్రం.. చాలా సంబరపడిపోతుందని.. తన పెద్దమ్మ వల్ల తనకి మంచి పాపులారిటీ వచ్చిందని.. తన ఇంట్లో చెబుతున్నట్లుగా సుకన్య తెలియజేసింది. ఈమధ్య అవకాశాలు సరిగ్గా రాకపోవడంతో తను నటించలేదని.. రాబోయే రోజుల్లో సరైన పాత్రలు వస్తే ఖచ్చితంగా నటిస్తానని తెలియజేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు