Adah Sharma : అదాకి అరుదైన జబ్బు… ఆ సినిమా వల్లే వచ్చిందా?

Adah Sharma : బాలీవుడ్ హీరోయిన్ అదా శర్మ ప్రస్తుతం తన కెరీర్లో పీక్స్ దశను ఎంజాయ్ చేస్తోంది. ఓవైపు ఓటిటి, మరోవైపు సినిమాలు అంటూ గత ఏడాదిలోనే ఆమె నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ ప్రాజెక్టులలో ఒక్కో దానికి ఒక్కోరకంగా మేకోవర్ కావలసి ఉండడం వల్ల అది ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపినట్టుగా తెలుస్తోంది. ఓ సినిమాకు బరువు తగ్గితే, మరో సినిమాకు బరువు పెరగాల్సి వస్తుంది. దీనివల్ల ఆమెకు అరుదైన జబ్బు వచ్చినట్టుగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. మరి అదా శర్మకు వచ్చిన జబ్బు ఏంటి అనే వివరాల్లోకి వెళితే…

అదా శర్మ సినిమా కష్టాలు

రీసెంట్ గా అదా శర్మ నటించిన నాలుగు సినిమాలు నాలుగు రకాల కాన్సెప్ట్ లతో ఉన్నాయి. ముందుగా ఇది కేరళ స్టోరీ గురించి చెప్పుకోవాలి. ఆమెకు భారీగా పాపులారిటీని తెచ్చిపెట్టిన ఈ మూవీలో అదా చదువుకునే కాలేజ్ అమ్మాయిలా కనిపించాలి. కాబట్టి చాలా వరకు బరువు తగ్గి సన్నగా మారింది. ఆ తర్వాత బస్తర్ మూవీ కోసం లావుగా అవ్వాల్సి వచ్చింది. సినిమా స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఆమె లావుగా కనిపించడంతో పాటు బరువైన గన్ లను మోయాల్సి వచ్చింది. అందుకే లావుగా కనిపించడంతో పాటు బలంగా ఉండడానికి రోజుకి 10 నుంచి 12 అరటి పండ్లు తిన్నాను అంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది అదా. అలాగే బరువు పెరిగినప్పటికీ అన్ఫిట్ గా ఉండకూడదు అని, ఎందుకంటే ఈ మూవీలో యాక్షన్ తో పాటు ఎనిమిది కిలోల బరువున్న నిజమైన తుపాకీలను మోస్తూ పర్వతాల పైకి కిందకి ఎక్కి, దిగడం వంటి పనులు చేయాల్సి వచ్చేదని వివరించింది.

Adah Sharma reveals her endometriosis diagnosis, says her period 'went on  for 48 days' during the filming of 'Bastar'

- Advertisement -

అందుకే గింజలు డ్రై ఫ్రూట్స్ ఫ్లాక్స్ సీడ్స్ కలగలిగిన లడ్డూలను ఎప్పుడూ తనతో పాటే తీసుకెళ్లలేదట. నిద్రపోయే అరగంట ముందు రెండు లడ్డులు తినేదాన్ని అని వివరించింది. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాలో బార్ డాన్సర్ గా చేయడం వల్ల చాలా వరకు వెయిట్ తగ్గాల్సి వచ్చిందట. మరోసారి సన్నగా కనిపించాల్సి ఉండడం వల్ల బాగా వర్కౌట్స్ చేసి సినిమాకు తగ్గట్టుగా మేకోవర్ అయ్యిందట.

ఆ అరుదైన వ్యాధితో ఇబ్బంది

అయితే ఇలా నెలల వ్యవధిలోనే శరీరంలో మార్పులు రావడం వల్ల ఆ ఒత్తిడికి అనారోగ్యం బారిన పడిందట అదా శర్మ. ఫలితంగా ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి వచ్చిందని చెప్పి షాక్ ఇచ్చింది. ఎండోమెట్రియోసిస్ అంటే పీరియడ్స్ నాన్ స్టాప్ గా కొనసాగడం. ఇటీవల కాలంలో చాలామంది అమ్మాయిల్లో ఒత్తిడి కారణంగా దీని బారిన పడుతున్నారు. ఈ జబ్బు కారణంగా దాదాపు 48 రోజుల పాటు ఆగకుండా వచ్చే పీరియడ్స్ తో ఇబ్బంది పడ్డాను అంటూ రీసెంట్ సినిమాల కోసం ఎంత కష్టపడిందో వెల్లడించింది. మొత్తానికి గత సంవత్సర కాలంలో మంచి పేరుతో పాటు ఇలా జబ్బు కూడా వచ్చే చేరింది. ఇక ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు అదా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని  కోరుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు