Adah Sharma: అలాంటి ఆనారోగ్య సమస్యతో ఆదాశర్మ.. ఏమిటంటే..?

Adah Sharma: సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఎవరైనా సరే తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తే… పేరు, డబ్బు రెండూ వస్తాయి.. అలాగే సక్సెస్ కూడా వస్తుంది. అయితే సక్సెస్ ఇచ్చే ఆనందం వెనుక అదే సమయంలో ఆ సక్సెస్ అందుకోవడానికి పడే కష్టం కొన్నిసార్లు అనారోగ్యాలను కూడా తెచ్చిపెడుతుంది. ఇప్పుడు అలాంటి ఒక అరుదైన ఇబ్బందితో బాధపడుతున్నానని చెబుతోంది అదా శర్మ.. తన ఆరోగ్య సమస్యలకు కారణం సినిమాల కోసం చేసిన డైటింగ్ లే అని చెబుతోంది ఈ వయ్యారి.. అదా శర్మ.. కేరళ స్టోరీ , బస్తర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ లను అందుకుంటూ దూసుకుపోతున్న ఈమె ప్రస్తుతం అన్ని భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక తెలుగులో సి డి (క్రిమినల్ ఆర్ డెవిల్ ) అనే సినిమాలో కూడా నటిస్తోంది.. అలాగే SSCM ప్రొడక్షన్స్ బ్యానర్ పై కృష్ణ అన్నం దర్శకత్వంలో ఆదాశర్మ మెయిన్ లీడ్ లో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, మహేష్ విట్టా పలువురు ముఖ్య పాత్రలతో ఈ సినిమాలో నటిస్తున్నారు అయితే ఇన్ని సినిమాలలో నటిస్తోంది.. కానీ తనకు మాత్రం ఆనందం లేదు అని చెబుతోంది.

అదా శర్మ సినిమాలు..

Adah Sharma: Adah Sharma with such a health problem.. what..?
Adah Sharma: Adah Sharma with such a health problem.. what..?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఇందులో నితిన్ హీరోగా నటించారు.. తొలి చూపులోనే కుర్రాళ్ళ గుండెలను దోచేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇందులో లిప్ లాక్ సన్నివేశాలతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆశించినంత స్థాయిలో అవకాశాలు లభించలేదు.. దీంతో పాటు చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా కనిపించింది.. ఈ క్రమంలోనే 2023లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కేరళ స్టోరీ తో అదాశర్మ ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది.. అసలు 2023 వరకు ఈమెను పట్టించుకున్న వారే లేరు.. కానీ ఈ ఒక్క సినిమాతో ఆఫర్లు వరుసగా తలుపు తట్టాయి.. ఈ సినిమా తర్వాత బస్తర్ సినిమాలో కూడా నటించింది. ఇక ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడి క్రేజ్ భారీగా పెరిగిపోయింది.

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అదా శర్మ..

ఇక ఇప్పుడు ఒక అరుదైన వ్యాధి వచ్చిందని..a షాకింగ్ విషయాలను బయటపెట్టింది. పైగా అది కూడా సినిమాల వల్లనే అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. అదా శర్మ మాట్లాడుతూ.. ది కేరళ స్టోరీ సినిమా చేసేటప్పుడు కాలేజీ అమ్మాయిలా కనిపించడానికి బరువు తగ్గాల్సి వచ్చింది.. ఆ తర్వాత బస్తర్ సినిమాలో నటించినప్పుడు బరువు పెరిగాను.. ఎందుకంటే ఆ సినిమాలో బరువైన గన్ లను మోయాలి కాబట్టి లావుగా కనిపించడంతోపాటుగా కాస్త బలంగా ఉండడానికి రోజు 12 వరకు అరటి పండ్లు తిన్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ , ఫ్లాక్ సీడ్స్ ఉన్న లడ్డూలను నాతో పాటు షూటింగ్ తీసుకెళ్లాను. ఒకరోజు నిద్రపోయే అరగంట ముందు రెండు లడ్డూలు తినేదాన్ని.. కానీ ఇప్పుడు మరో సినిమా కోసం బరువు తగ్గాల్సి వచ్చింది.. ఇలా నెలల వ్యవధిలోనే బరువు తగ్గడం , మళ్ళీ పెరగడం ఆ తర్వాత తగ్గడం వల్ల నా శరీరంలో రకరకాల మార్పులు చోటు చేసుకోవడంతో పాటు ఒత్తిడికి కూడా గురయ్యాను.. దీనివల్ల ఆరోగ్యానికి గురయ్యాను ప్రస్తుతం ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి వచ్చింది అంటూ అని చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఎండోమెట్రియోసిస్ వ్యాధి లక్షణాలు ..

ఈ వ్యాధి వచ్చిన వారిలో పీరియడ్స్ నాన్ స్టాప్ గా కొనసాగుతూ ఉంటుంది.. ఈ జబ్బు కారణంగా ఈమె కూడా దాదాపు 48 రోజులపాటు ఆగకుండా వచ్చే పీరియడ్స్ తో చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది అదాశర్మ.. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు