Adavi Sesh: క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్న పాపను కలిసిన అడవి శేష్

Adavi Sesh: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో అడవి చెస్ ఒకరు. కర్మ అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శేష్. కానీ ఈ సినిమా. ఒకటి ఉంది అని చాలామందికి తెలియదు. ఇకపోతే విష్ణువర్ధన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో ఒక పాత్రలో కనిపించాడు శేష్. ఆ పాత్ర శేష్ మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత శేష్ చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి గుర్తింపును సాధించుకున్నాయి. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన రన్ రాజా రన్ సినిమా శేష్ కెరీర్ కి మంచి గుర్తింపును తీసుకొచ్చి హీరోగా కూడా అవకాశాలు వచ్చేలా చేసింది.

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో శేష్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ఖచ్ఛితంగా అది బాగుంటుంది అని ఏమీ ఆలోచించకుండా థియేటర్ కు వెళ్లిపోయే ఆడియన్స్ ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు శేష్ హీరోగా చేసిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాలను సాధించాయి. కేవలం థియేటర్లోనే కాకుండా ఓటిటిలో రిలీజ్ అయినప్పుడు కూడా ఆ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

Adivi Sesh

- Advertisement -

ఇక ప్రస్తుతం శేష్ చేస్తున్న సినిమా గూఢచారి – 2 ఈ సినిమా మీద కూడా అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. ఇక శేష్ నుంచి చివరగా వచ్చిన మేజర్ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఇకపోతే రీసెంట్ గా క్యాన్సర్ తో పోరాడుతున్న ఒక చిన్న పాపను శేష్ కలిశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు