Prabhas : ఆదిపురుష్ కి ఇంత డిమాండా !

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం “ఆదిపురుష్” వాల్మీకి రాసిన ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న రిలీజ్ కి సిద్దమవుతుంది.

అయితే రిలీజ్ దగ్గరికి వస్తోన్న ఏమాత్రం అంచనాలు లేని ఆదిపురుష్ సినిమాపై గత కొద్దీ రోజులుగా అంచనాలు పెరుగుతున్నాయి. రీసెంట్ గానే ఆదిపురుష్ సినిమాని ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి సెలెక్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై బజ్ రావడం స్టార్ట్ అయింది. ఐతే గతంలో గ్రాఫిక్స్ విషయంలో ఘోరంగా విమర్శలు ఎదుర్కొన్న ఆదిపురుష్ టీం కొద్దీ రోజులు సమయం తీసుకొని గ్రాఫిక్స్ మీద మళ్ళీ వర్క్ చేసారు. లేటెస్ట్ గా ఆదిపురుష్ టీం రిలీజ్ చేసిన పోస్టర్స్ లో మంచి గ్రాఫిక్స్ తో పోస్టర్స్ అందరిని ఆకట్టుకున్నాయి.

అయితే ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఒక సినిమాని ఒక్కసారి మాత్రమే ప్రదర్శిస్తారు. ప్రపంచం నలుమూల నుంచి ఫిలిం మేకర్స్ ఈ షో లకి అటెండ్ అవుతారు. అలాంటి ట్రిబెకా లో ఆదిపురుష్ సినిమా షో లని పెంచాలని డిమాండ్ వచ్చిందట. పబ్లిక్ నుంచి రావడంతో ఒక్కసారి మాత్రమే  ప్రదర్శించే ఛాన్స్ ఉన్న సినిమాని ఇప్ప్పుడు ఏకంగా 3 షోలు  ప్రదర్శించబోతున్నారంట .జూన్ 7 నుంచి జూన్ 18 వరకు జరగబోయే ఈ ఫెస్టివల్ లో ఇండియా నుంచి ఆదిపురుష్ మూవీ సెలెక్ట్ అవడం గొప్ప విషయం అనుకుంటే ఇప్పుడు ఏకంగా మూడు షోలు అంటే ఆదిపురుష్ సినిమాకోసం ప్రపంచవ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

జూన్ 16న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ని మే నెల రెండోవారం నుంచి పెద్ద ఎత్తున ప్రారంభించబోతున్నారు. మొదటగా ముంబై , ఢిల్లీ నుంచి మొదలు పెట్టి నార్త్ స్టేట్స్ అన్నిటిలో ఆదిపురుష్ హవా ఉండబోతుంది. నార్త్ మొత్తం ప్రమోషన్స్ అయిపోయాక జూన్ మొదటి వారం నుంచి సౌత్ స్టేట్స్ ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు