Adhurs Re release: అది ఓల్డ్ రా చారి… ఏదైనా కొత్తగా ట్రై చెయ్యండిరా!

గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో రీ- రిలీజ్ ల పర్వం కొనసాగుతోంది. గతంలో వచ్చి, ప్రేక్షకులను వెర్రెత్తించిన స్టార్ హీరోల సినిమాలను మళ్ళీ థియేటర్లలో వేసి క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది ప్రొడ్యూసర్స్. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు తదితరుల సినిమాలను వరుసగా రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే ముందుగా ఈ ట్రెండ్ కు బాగానే రెస్పాన్స్ వచ్చింది.

కానీ ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ పాత చింతకాయ పచ్చడి అయిపోయినట్టు కన్పిస్తోంది. ఇప్పటికే టీవీల్లో, ఓటిటిలలో వచ్చిన పలు సినిమాలను చూడడానికి తెలుగు ప్రేక్షకులు ఏమాత్రం ఇంటరెస్ట్ చూపించడం లేదు. తాజాగా తారక్ సినిమాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. తాజాగా ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ “అదుర్స్” రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. గతంలో ఎన్టీఆర్‌ ‘ఆది’, ‘సాంబ’ చిత్రాలకు దర్శకత్వం వహించిన వివి వినాయక్‌ ‘అదుర్స్‌’కి దర్శకత్వం వహించారు.

‘ఆది’ భారీ బ్లాక్‌బస్టర్ అయితే, ‘సాంబ’ ఆ మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయడంలో విఫలమైంది. ‘అదుర్స్’ మాత్రం హిట్ గా నిలిచింది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ నవంబర్ 18న మళ్ళీ థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కానీ ఈ మూవీకి బుకింగ్స్ చాలా పూర్ గా ఉన్నాయని తెలుస్తోంది. RTC X రోడ్స్‌ లాంటి థియేటర్ లో కూడా బుకింగ్స్ దారుణంగా ఉన్నాయట. ‘అదుర్స్’ కంటే ఈ నెల ప్రారంభంలో విడుదలైన మెగా స్టార్ చిరంజీవి “శంకర్ దాదా MBBS” బుకింగ్స్ బెటర్ అంటున్నారు. అయితే ఈ సినిమా రీ రిలీజ్ కు కూడా దారుణమైన రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి.

- Advertisement -

‘అదుర్స్’ మూవీ రీరిలీజ్‌పై ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవడంతో మునుపటిలా రీ రిలీజ్ లు మ్యాజిక్ చేయలేకపోతున్నాయి అనే విషయం తేటతెల్లం అయ్యింది. ఈ నేపథ్యంలో ఇలా సినిమాల రీ రిలీజ్ లు పెట్టి దారుణమైన బుకింగ్స్, కలెక్షన్స్ తో హీరోలు, వారి అభిమానుల పరువు తియ్యకండి అని కొందరు ఫైర్ అయితే, మరికొంత మంది మాత్రం ఇది ఓల్డ్ అయిపోయిందిరా చారి… ఏదైనా కొత్తగా ట్రై చెయ్యండి అంటూ ‘అదుర్స్’ సినిమాలో బ్రహ్మానందం స్టైల్ లో సెటైర్లు వేస్తున్నారు.

ఇప్పటికైనా ఈ రిలీజ్ ల ట్రెండ్ ఆపుతారో, లేదంటే ఇలాగే జనాలను టార్చర్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారో చూడాలి. మరి విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ‘అదుర్స్’ బుకింగ్స్ పుంజుకుంటాయో లేదో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు