Prabhas: ‘ఆదిపురుష్’ డర్టీయెస్ట్ మూవీ… హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ మూవీ ‘ఆది పురుష్’ ఆయన అభిమానులను సైతం మెప్పించలేదన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీపై ఓ తెలుగు హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసింది. ‘ఆది పురుష్’ అనే మూవీ బ్లండర్ డిజాస్టర్, డర్టీయెస్ట్ మూవీ అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో మాధవీలత చెప్పుకొచ్చింది.

2008లో వచ్చిన “నచ్చావులే” సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవీలత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. నాని హీరోగా నటించిన ‘స్నేహితుడా’, హార్రర్ మూవీ ‘అరవింద్ 2’తో పాటు మరి కొన్ని సినిమాల్లో నటించిన ఈ తెలుగు అమ్మాయిని తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. కానీ ఆ తర్వాత ఇండస్ట్రీనే తనను దూరం పెట్టిందని మాధవీలత వెల్లడించారు. నిజానికి తాను నటించిన ఆరేడు తెలుగు సినిమాలు ఇప్పటికీ విడుదల కాలేదంటూఆవేదన వ్యక్తం చేసింది.

ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఆమె ఈ విషయాలన్నీ మాట్లాడగా, ‘ఆదిపురుష్’ సినిమా గురించి కూడా సంచలన కామెంట్స్ చేసింది. అంతేకాదు హిందువులను విడగొట్టడానికే ‘ఆది పురుష్’ సినిమా చేశారంటూ దర్శక నిర్మాతలను సైతం ఏకిపారేసింది. సినిమాటిక్ లిబర్టీ పేరుతో రామాయణాన్ని పూర్తిగా వక్రీకరించారని మాధవి లత చేసిన కామెంట్స్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇక మాధవీలత ఇంటర్వ్యూ ను చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ తమ హీరో సినిమాను ఆమె తక్కువ చేసి మాట్లాడడం ఏంటని ఫైర్ అవుతున్నారు. మరోవైపు ‘సలార్’ రిలీజ్ కు రెడీగా ఉన్న తరుణంలో మాధవి ఇలాంటి కామెంట్స్ చేయడం కేవలం పబ్లిసిటీ కోసమేనని అంటున్నారు.

- Advertisement -

ఇక ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ వంటి భారీ తారాగణంతో ఈ ఏడాది జూన్ 16 “ఆదిపురుష్” థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ మూవీ ఏ కోశాన కూడా ప్రేక్షకులను మెప్పించ లేకపోయింది. ఓం రౌత్ దర్శకత్వంపై కూడా విమర్శకులు విరుచుకుపడ్డారు. కాగా మూవీ గురించి మాత్రమే కాకుండా మాధవీలత ఇండస్ట్రీపై కూడా పలు సంచలన ఆరోపణలు చేసింది.

ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోవడంతో రాజకీయాలలో రాణించే ప్రయత్నాలు చేస్తోంది మాధవీలత. టాలీవుడ్ ఫైర్ బ్రాండ్స్ లో ఒకరైన ఈమె రాజకీయాల్లో భాగంగా గతంలోనే బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో జరిగే విషయాలపై స్పందిస్తూ ఉంటుంది.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు