Adire Abhi: హైపర్ ఆది గుట్టురట్టు చేసిన అభి.. అలాంటివాడు అంటూ సంచలన కామెంట్లు.!

Adire Abhi.. తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూ ఏకైక కామెడీ షో గా గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్.. ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదించింది.. దాదాపు దశాబ్ద కాలానికి పైగా ప్రసారమవుతున్న ఈ షో ఎత్తు పల్లాలను కూడా చూసిందని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఎంతో మంది కళాకారులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ షో ఇప్పుడు మరింత పాపులారిటీ సొంతం చేసుకుందని చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ షో వల్ల భారీ పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలలో అదిరే అభి అలియాస్ అభినయ కృష్ణ కూడా ఒకరు. తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు.

జబర్దస్త్ కంటే ముందే బుల్లితెరపై ఫేమస్..

అదిరే అభి జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం కంటే ముందే సినిమాలలో నటించి పలు బుల్లితెర షోలలో యాంకర్ గా కూడా కనిపించారు.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి భారీ పేరు సంపాదించుకున్న ఈయన కమెడియన్ నుంచి టీం లీడర్ గా ఎదిగి ఎన్నో సంవత్సరాలు జబర్దస్త్ లోనే కొనసాగాడు.. చాలాకాలంగా ఒక టీం కి లీడర్ గా కొనసాగిన అభి..ఈ క్రమంలోనే బయట అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది కళాకారులను బుల్లితెరకు పరిచయం చేశాడు.. ఇప్పుడు ఎంతో పాపులర్ అయిన హైపర్ ఆదిని కూడా ఒకప్పుడు పరిచయం చేసింది అభినే అని చాలామందికి తెలియదు.. అందుకే టీం లీడర్ గా కూడా అతడు పేరు సొంతం చేసుకున్నారు.

అభి వల్లే ఆదికి స్థానం..

టీం లీడర్గా సందడి చేసిన అభి ఇటీవలే ఈ షో నుంచి తప్పుకున్నారు.. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.. అయితే ఫలితంగా అదిరి అభిని అభిమానించే వాళ్లంతా నిరాశ చెందుతున్నారు.. అతడు సినిమాలపై ఫోకస్ చేయడం కోసమే జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడని కామెంట్లు కూడా చేస్తున్నారు.. ఇదిలా ఉండగా జబర్దస్త్ షోలో ప్రస్తుతం టాప్ కమెడియన్లలో ఒకరైన హైపర్ ఆదిని అభి పరిచయం చేసిన విషయం తెలిసిందే.. అయితే చాలా రోజులపాటు గురుశిష్యుల్లా ఉన్న వీరిద్దరూ కొంతకాలంగా విభేదాల వల్ల మాట్లాడుకోవడం లేదనే వార్తలు వైరల్ అవుతున్నాయి.. వీటిపై ఇద్దరు స్పందించినా ఇప్పటికీ అడపాదడపా వార్తలు వస్తూనే ఉంటాయి.

- Advertisement -

ఆదితో విభేదాలపై అభి క్లారిటీ..

Adire Abhi: Sensational comments saying about hyper Adi..!
Adire Abhi: Sensational comments saying about hyper Adi..!

ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభి.. తనతో విభేదాల వల్లే ఆది బయటకు వెళ్ళిపోయాడు అన్న వార్తలు వచ్చాయి.. అందులో నిజం లేదు.. కొత్త టీం ఏర్పాటు చేయాలని సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరినీ కలిపి ఒక టీం తయారు చేశారు.. అలా హైపర్ ఆదికి టీం వచ్చింది.. ఆది టీం లీడర్ అయినందుకు నేను సంతోషిస్తున్నాను అంటూ తెలిపారు అభి. మొత్తానికి అయితే తనకు హైపర్ ఆదికి మధ్య ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు.

డైరెక్షన్ అంటే ఇష్టం అంటున్న అభి..

ప్రస్తుతం తనకు సినిమాలకు డైరెక్షన్ చేయడం అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.. జబర్దస్త్ లో కొనసాగిన సమయంలోనే నాకు డైరెక్షన్ పై ఎంతో ఇష్టం ఉండేది.. ఆ ఇష్టంతోనే అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పై ఫోకస్ చేశాను.. ఇప్పుడు కూడా ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాను అంటూ తెలిపారు. ఇక ఈ విషయం విన్న అభిమానులు.. అభి త్వరగా ఇండస్ట్రీలోకి డైరెక్టర్గా అడుగులు వేయాలని తెలిపారు.. ఇప్పటికే జబర్దస్త్ లో చేసిన వేణు డైరెక్టర్గా బలగం సినిమా చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.. మరి ఆయన స్నేహితుడైన అభి కూడా డైరెక్షన్లో సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు