Adire Abhi : యాక్టింగ్ ఇష్టమంటే ముందు చదువుకొమ్మని చెప్తాను – జబర్దస్త్ అభి

Adire Abhi : టాలీవుడ్ లో టాలెంట్ ని నమ్ముకుని వచ్చినవారు నీతో మంది ఉన్నారు. కానీ వాళ్లలో కొంతమందే సక్సెస్ అయ్యారు. అవుతున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీ లో టాలెంట్ ఒకటే సరిపోదు. ఎదగాలంటే, క్రమశిక్షణ, పట్టుదల, అంతకు మించిన అదృష్టం తోడవ్వాలి. ఇక సినిమా లైఫ్ అంటే గ్యారెంటీ లేని లైఫ్‌. స‌క్సెస్ అయితే జీవితం ఒక‌లా ఉంటుంది? స‌క్సెస్ పోతే అంతే ద‌య‌నీయంగానూ ఉంటుంది. ఇండ‌స్ట్రీ కి స‌క్సెస్ కోసం వ‌చ్చిన విజ‌యం సాధించిన వారికంటే ఫెయిలైన వారే ఎక్కువ ఉంటారు. ఇక్క‌డ ట్యాలెంట్ తో పాటు అదృష్టం కూడా క‌లిసి రావాలి. ఇంకా చెప్పాలంటే? ట్యాలెంట్ కంటే ల‌క్ అనేది కీల‌క‌పాత్ర పోషిస్తుంది. ఎలాంటి ఫ్యాష‌న్ లేకుండా ల‌క్కీగా అవ‌కాశాలొచ్చి స‌క్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు. ఇక టాలెంట్ ఉండి ఫెయిలైన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ విషయాలపై తాజాగా యాంకర్ క‌మ్ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ అదిరే అభి సినిమా ఇండ‌స్ట్రీ గురించి త‌న అనుభ‌వాన్ని పంచుకునే ప్ర‌య‌త్నం చేసాడు.

యాక్టింగ్ కాదు ముందు చదువుకొమ్మని చెప్తాను..

ఇక ఇండస్ట్రీ కి వచ్చిన తొలినాళ్ళ గురించి అదిరే అభి(Adire Abhi) ఈ విధంగా ప్రస్తావించాడు. నా చిన్నతనం నుంచి నాకు నటన అంటే ఇష్టం’. అందువలన నేను సినిమాల వైపు వచ్చాను. పల్లెటూర్లో ఉంటూ సినిమాలను గురించి మనం అనుకునేది వేరు . ఇక్కడికి వచ్చిన తరువాత మనకి కనిపించేది వేరు. సినిమాలలో అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో నేను జాబ్ వైపు వెళ్లిపోయాను. 10 ఏళ్ల పాటు నేను సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ టీవీ షోస్ చేస్తూ కెరియర్ ను కొనసాగించాను. ఆఫీస్ లో మా బాస్ సహకరించడం వల్లనే ఇది సాధ్యమైంది. నాకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతానికి చదువుపైనే దృష్టిపెట్టమని చెప్పాను. యాక్టింగ్ అంటే ఇష్టమా లేదా అనేది కూడా నేను అడగలేదు. అలాగే తనకు బయట కూడా యాక్టింగ్ అంటే ఇష్టమని నాతో ఎవరు చెప్పినా, ముందుగా చదువు పూర్తిచేయమని చెబుతాను. ముందుగా చదువుకోవాలి . ఆ తరువాత ఆర్ధిక పరమైన భద్రత కోసం డబ్బు సంపాదించుకోవాలి. ఆ తరువాత నటన వైపు రావొచ్చు అని చెప్పుకొచ్చాడు.

Adire Abhi Talks About His Film Troubles

- Advertisement -

సక్సెస్ కాకపోతే నిలబడలేం..

అయితే ఇండస్ట్రీ లో సక్సెస్ కాకపోతే మనల్ని ఎవ్వరూ పట్టించుకోరని అన్నాడు అభి(Adire Abhi). ఎందుకంటే ఇక్కడ సక్సెస్ అయ్యేవారు చాలా తక్కువమంది. సక్సెస్ కాలేకపోతే బయటికి వెళ్లి ఏ పనీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అలా అయోమయంలో పడిపోయినవారిని తాను చాలామందిని చూశానని, ఒక‌సారి మ్యాక‌ప్ కి అల‌వాటు పడిన త‌ర్వాత రోజు మ్యాక‌ప్ వేయాల‌నిపిస్తుంది. అది ఒక్క‌సారిగా దూర‌మ‌వుతుందంటే త‌ట్టుకోవ‌డం క‌ష్టం. కానీ ఇక్క‌డ అన్నిర‌కాల ప‌రిస్థితుల‌కు త‌ట్టుకోగ‌ల‌గాలి అని అన్నాడు. ఇక అదిరే అభి సినిమాల కంటే జబర్దస్త్ ద్వారానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకోగా, ప్రస్తుతం అడపాదడపా చిన్న సినిమాల్లోనే నటిస్తున్నాడు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు