Adithi Rao hydari: సర్జరీ మహిమ.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సిద్దార్థ్ కాబోయే భార్య..!

Adithi Rao hydari: సాధారణంగా అందంగా కనిపించడానికి చాలామంది హీరోలు, హీరోయిన్లు మేకప్ వేస్తూ ఉంటారు.అయితే తమ బాడీని షేప్ చేసుకోవడానికి సర్జరీల బాట పడుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సర్జరీలు సక్సెస్ అయితే వారి అందం రెట్టింపు అవుతుంది.. ఒకవేళ వికటిస్తే అంతకంటే అద్వానంగా మరొకరు ఉండరేమో అనిపిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి తాజాగా సర్జరీ చేయించుకొని గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఈమెను చూసి అభిమానుల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈమె పాత ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.. గుర్తుపట్టలేనంతగా ఉన్న ఆ పాత ఫోటోలు చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు..

ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ..

Adithi Rao hydari: Surgery Mahima.. Siddharth's future wife who has changed beyond recognition..!
Adithi Rao hydari: Surgery Mahima.. Siddharth’s future wife who has changed beyond recognition..!

అదితి ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అయితే అంతకు ముందు ఆమె ఎలా ఉంది అనే ఫోటోలు బయటకు రాలేదు.. ఇప్పుడు పాత ఫోటోలు ఇంటర్నెట్లో దర్శనం ఇచ్చేసరికి.. అసలు ఇది ఆమేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..ఇకపోతే పాత ఫోటోలను, ప్రస్తుత ఫోటోలను షేర్ చేస్తూ.. రెండు ఫోటోల మధ్య ఉన్న తేడాలను కూడా కనిపెట్టేస్తున్నారు నెటిజెన్స్ బిఫోర్ ఆఫ్టర్ టైప్ లో ఫోటోలలో స్పష్టంగా ఆమె ముక్కు సౌష్టవంలో తేడాలు కనిపిస్తున్నాయి.. ఇక్కడ ఫోటోలను మనం గమనించినట్లయితే పాత ఫోటోలలో ఈమె ముక్కు కాస్త మందంగా ఉంది.. సర్జరీ తర్వాత కోటేరు లాంటి ముక్కులా నాజూగ్గా మారిపోయింది.

ఫోటోలు వైరల్..

ఇక ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు డబ్బు ఉంటే చాలు అందాన్ని సులభంగా కొనుక్కోవచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు..అయితే కొంతమంది పాత ఫోటోలకే ఓటు వేస్తుంటే.. మరి కొంతమంది కొత్త ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.. సర్జరీ చేయించుకోవడం తప్పు కాదని.. అయితే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఎందుకు ఆ నిజాన్ని దాస్తారో అర్థం కావడం లేదని కూడా మరి కొంత మంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.. మొత్తానికైతే పాత ఫోటోలను చూసినవారు ఈమె సర్జరీ తర్వాత చేయించుకున్న ఫోటోలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.. అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని మునుపటి ఫోటోలే చాలా బాగున్నాయని మరి కొంతమంది కామెంట్లో చేస్తూ ఉండడం గమనార్హం.. మరికొంతమంది అంతా సర్జరీ మహిమ.. గతం కంటే ఇప్పుడు చాలా అందంగా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

- Advertisement -

కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో సందడి..

ఇదిలా ఉండగా సర్జరీ కి మునుపు లైమ్ లైట్ లోకి వచ్చేసింది తాజాగా జరిగిన కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తన లేలేత అందాలను ఆరబోస్తూ అందరిని కట్టిపడేసింది ఇప్పుడు గుర్తుపట్టని రూపంలో కనిపించి అందరిని నోరేళ్లపెట్టేలా చేస్తోంది.. మొత్తానికైతే గ్లామరస్ అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ ముద్దు..

కాబోయే భర్త పై ప్రశంసలు..

గత కొన్ని నెలలుగా హీరో సిద్దార్థ్ తో ప్రేమ వ్యవహారం కొనసాగించిన ఈమె పలు ఫంక్షన్లకు , ఈవెంట్లకు అతడితో కలిసి జంటగా వెళ్ళింది.. అంతేకాదు శర్వానంద్ పెళ్లికి కూడా సిద్ధార్థ్ ఈమెతో కలిసి జంటగా హాజరైన విషయం తెలిసిందే.. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వినిపించాయి.. కానీ వీరు మాత్రం స్పందించలేదు.. కానీ ఎట్టకేలకు వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకొని అందరి అనుమానాలను నిజం చేశారు ..ఇక వీరిద్దరూ కలిసి మహాసముద్రం సినిమా లో కలిసి నటించిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు