Aditi Govitrikar: ‘తమ్ముడు’ సెకండ్ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ?

Aditi Govitrikar: టాలీవుడ్‌ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో తమ్ముడు సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా అనంతరం సినిమా చేసుకుంటూ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో తన బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ హైక్లాస్ అమ్మాయి వెంటపడుతూ ఉండే సీన్స్ సినిమాకి హైలైట్ అనిపిస్తాయి. ఆ అమ్మాయి కోసం పవన్ చేసే చిన్న చిన్న పనులు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. ఇక ఈ సినిమాలో ప్రీతి జింగానియా హీరోయిన్గా నటించగా…. సెకండ్ హీరోయిన్ గా ఆదితి గోవిత్రికర్ నటించింది. తమ్ముడు సినిమాలో లవ్లీ పాత్రలో అదితి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ముంబైకి చెందిన ఈ బ్యూటీ తమ్ముడు సినిమా అనంతరం ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది.

Aditi Govitrikar : 'తమ్ముడు' సెకండ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి.. ఇప్పుడు ఏం చేస్తుందంటే.. | Pawan kalyan thammudu movie heroine aditi govitrikar recent photos goes viral ...
ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. బాలీవుడ్ లో మాత్రం కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఆడపాదాడపా టీవీ షోలలో, వెబ్ సిరీస్ లలో కనిపిస్తూ మెప్పిస్తోంది. అయితే ఈ బ్యూటీ ఓ డాక్టర్. ఎంబిబిఎస్ తర్వాత మోడలింగ్ మీద ఆసక్తితో మోడలింగ్ చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. ఇక ఈ బ్యూటీ కరోనా సమయంలో ఫుల్ టైం డాక్టర్, సైకాలజిస్ట్ గా తన వృత్తిని నిర్వర్తించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మోడల్ షోలలో కూడా పాల్గొంటూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు