Aditi – Siddarth: పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Aditi – Siddarth.. ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు వరుసగా వివాహం చేసుకుంటూ ఒకటి అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ వైవాహిక బంధాలలో విసుగులు వచ్చి విడాకులు తీసుకొని వేరుపడిన ఇద్దరు సెలబ్రిటీలు మరో కొత్త తోడును వెతుక్కొని ఒక్కటి కాబోతున్నారు.. అలాంటి వారిలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి కూడా ఒకరు.. వీరిద్దరూ దాదాపు పది సంవత్సరాల చొప్పున విడివిడిగా తమ వైవాహిక బంధంలో సంతోషంగా ఉండి ఆ తర్వాత విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు.. ఇక ఇప్పుడు అటు సిద్ధార్థ్ ఇటు అదితి ఇద్దరు ఒకటి కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే గత కొంతకాలంగా చట్టా పట్టాలేసుకొని తిరిగిన ఇద్దరూ.. మీడియా కంట పడితే మీడియా పైన ఫైర్ అయ్యారు.. తమ మధ్య అటువంటి బంధం ఏమీ లేదని.. కావాలని రూమర్స్ సృష్టిస్తున్నారు అంటూ హీరో సిద్ధార్థ్ కోప్పడిన విషయం తెలిసిందే.. కానీ ఎట్టకేలకు వీరిద్దరూ రహస్యంగా ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆ విషయాన్ని బయటపెట్టారు ఈ జంట.. అయితే ఇప్పుడు నిశ్చితార్థం జరిగిన వెంటనే హనీమూన్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది.. ఇటలీలోని టస్కిన్ కి విహారయాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ వీరు ఎంజాయ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో వీరిద్దరూ ఇప్పుడు హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సిద్దార్థ్ – అదితి పెళ్లి డేట్ ఫిక్స్..

Aditi - Siddarth: Wedding Date Fix.. When..?
Aditi – Siddarth: Wedding Date Fix.. When..?

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సిద్దార్థ్, అదితి డిసెంబర్ నెలలో ఒకటి కాబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా డిసెంబరు ఒకటి , రెండు తేదీలలో వీరి వివాహం జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ తాజాగా ఈ తారీకులలో వీరు వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా డిసెంబర్లో ఈ జంట ఒక్కటి కాబోతోందని సమాచారం.

- Advertisement -

సిద్దార్థ్ సినిమాలు:

ఇక సిద్ధార్థ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సిద్ధార్థ్ ఇండియన్ 2 సినిమాలో హీరోలు చేస్తున్నారు.. తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ సినిమా జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంతో కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సిద్ధార్థ్ కి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ఇండియన్ 2:

ఇక ఇండియన్ 2 సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ కీలకపాత్ర పోషిస్తోంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇటీవల జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్లో కాజల్ అగర్వాల్ ఇందులో నటించడం లేదని ఇండియన్ 3 లో ఆమె ఉంటుందని చెప్పి అభిమానులను నిరాశకు గురి చేశారు శంకర్. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు