Adivi Sesh: ఆ హీరోయిన్ తో అలాంటి సీన్… అసహ్యం వేసిందంటున్న అడివి శేష్

Adivi Sesh : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ ఓ హీరోయిన్ విషయంలో చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. ఆమెతో అలాంటి సీన్స్ చేయడం అసహ్యంగా అనిపించింది అంటూ అడవి శేష్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ హీరోయిన్ ప్రస్తుతం స్టార్ ఓ పాన్ ఇండియా హీరోయిన్ కావడమే కాదు, అడవి శేషుతో కలిసి రానున్న ఓ సినిమాలో రొమాన్స్ కూడా చేయబోతోంది. మరి ఇంతకీ ఆమె వల్ల అడవి శేష్ ఎందుకు అంత బ్యాడ్ గా ఫీల్ అయ్యాడు? అంటే…

నెగిటివ్ రోల్ నెగిటివ్ ఫీలింగ్…

కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన అడవి శేష్ ప్రస్తుతం హీరోగా దూసుకెళ్తున్నాడు. అయితే తన కెరీర్ స్టార్టింగ్ లో ఈ హీరో ఎక్కువగా నెగిటివ్ క్యారెక్టర్స్ లోనే కనిపించాడు. అందులో అడవి శేషు విలన్ గా నటించిన బలుపు కూడా ఒకటి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో తాను చేసిన పాత్ర వల్లే అడవి శేషుకి తనపై తనకే అసహ్యం వేసిందట.

Adivi Sesh opens up on what commercial success means to him - The Statesman

- Advertisement -

అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలో తన పాత్ర తనకే అస్సలు నచ్చలేదట. బలుపు సినిమాలో తనకు నచ్చని పాత్రను చేసానంటూ చెప్పుకొచ్చిన అడవి శేష్ అందులో హీరోయిన్ శృతి హాసన్ జుట్టును పట్టుకొని లాక్కెళ్ళే సీన్ చేసినప్పుడు తనమీద తనకే అసహ్యం వేసిందని చెప్పి షాక్ ఇచ్చారు. ఇలాంటి పాత్రలు చేస్తున్నానా అనుకుంటూ అప్పట్లో నెక్స్ట్ తాను చేయబోయే సినిమాల విషయంలో ఆలోచనలో పడ్డాడట. ఆ మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ తన పాత్ర ఉపయోగం లేకుండా పోయిందని అడవి శేషు వెల్లడించాడు. అయితే ఆ సినిమా వల్ల తనకు జరిగిన ఒకే ఒక్క మంచి రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేనిలతో పరిచయం అవ్వడమేనని చెప్పుకొచ్చాడు. శృతి హాసన్ తో అలాంటి సీన్ చేయడం వల్లే తనలో కసి పెరిగి ఆ తర్వాత ఏకంగా వరుసగా ఐదు హిట్స్ కొట్టినట్టు చెప్పుకొచ్చాడు.

ఆ హీరోయిన్ తోనే మళ్లీ రొమాన్స్

కెరీర్ మొదట్లో అడవి శేషు క్యారెక్టర్ రోల్స్, నెగెటివ్ క్యారెక్టర్స్ చేసిన ఈ హీరో ఆ తరువాత మెల్లగా సెకండ్ హీరోగా మారాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, రన్ రాజా రన్, బాహుబలి, దొంగాట, ఊపిరి, సైజ్ జీరో సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో కనిపించాడు. ఆ తర్వాత క్షణం, అమి తుమి, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్స్ వంటి సినిమాలతో వరస హిట్స్ ను తన ఖాతాలో వేసుకుని కంటెంట్ ఉన్న సినిమాలకు కటౌట్ గా మారాడు. ప్రస్తుతం ఈ హీరో గూఢచారి 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే శృతి హాసన్ తో కలిసి డెకాయిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు