Adivi Seshu: సూపర్ స్టార్ కృష్ణ మీద ప్రేమతో ఆ పని చేసిన అడివి శేషు..!

Adivi Seshu.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన హీరోలలో అడివి శేషు కూడా ఒకరు.. ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలలో స్పై ఏజెంట్ పాత్రలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. సక్సెస్ ఫుల్ రేట్ ఎక్కువగా ఉన్న యంగ్ హీరోగా పేరు సంపాదించారు అడివి శేషు. తక్కువ బడ్జెట్ తోనే భారీ హిట్ చిత్రాలను అందుకున్నారు అడివి శేషు. మొదట తన సినీ కెరియర్ ను క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా మొదలుపెట్టి క్షణం చిత్రంతో హీరోగా తన సినీ కెరీర్ ని ప్రారంభించారు.

తక్కువ సినిమాలైనా సక్సెస్ రేట్ ఎక్కువ..

ఆ తర్వాత మేజర్, గూఢచారి, హిట్ -2, ఎవరు తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఇటీవలే అడివి శేషు నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. గూఢచారి-2, డెకాయిట్ వంటి చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ అంటే తనకు విపరీతమైన అభిమానమని.. ఆయన మీద ఉన్న అభిమానంతోనే తన కారు నెంబర్ చేయించుకున్నాను అనే విషయాన్ని వెల్లడించారు.

కృష్ణ పై విపరీతమైన అభిమానం..

Adivi Seshu: Adivi Seshu who did that with love for superstar Krishna..!
Adivi Seshu: Adivi Seshu who did that with love for superstar Krishna..!

అడివి శేషు మాట్లాడుతూ.. తనకు సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి-116 చిత్రం అంటే చాలా ఎక్కువ ఇష్టమని.. ఈ చిత్రం ద్వారానే తెలుగులో ఎన్నో స్పై సినిమాలు మొదలయ్యాయి అని కూడా తెలియజేశారు. తను నటించిన గూఢచారి సినిమా కూడా సూపర్ స్టార్ కృష్ణ సినిమా నుంచే ప్రేరణ అంటూ తెలిపారు.. నాకు కృష్ణ గూఢచారి సినిమాలో 116 అనే నెంబర్ కూడా చాలా ఇష్టమని.. అందుకే తన చిత్రంలో కూడా ఈ నెంబర్ ఉంటుంది అంటూ వెల్లడించారు. అలాగే తన కారు కి కూడా ఈ నెంబర్ కావాలనే తీసుకున్నానని వెల్లడించారు అడివి శేషు.

- Advertisement -

ఆ అభిమానంతోనే కార్ నెంబర్..

తన కారు నెంబరు 0116 ఉంటుంది అంటూ తెలిపారు. కృష్ణ మీద తనకు చాలా ప్రేమ ఉందని.. ఆ ప్రేమని ఈ విధంగా చాటుకున్నానని తెలిపారు. అడివి శేషు స్పై సస్పెన్స్ థ్రిల్లర్ ఇతరత్రా పాత్రలో కూడా మెప్పించగలడు. స్పై సినిమాలు అంటే మరింత ఎక్కువ ఇష్టమని.. అందుకే తన కారుకి కూడా గూఢచారి నెంబర్ తీసుకునేంత ఇష్టంగా మారిపోయింది అంటూ తెలియజేశారు. ప్రస్తుతం అడివి శేషు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అడివి శేషు కెరియర్..

అడివి శేషు విషయానికి వస్తే.. సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడడానికి మంచి హైట్, లుక్ ఉండడం వల్ల కూడా ఈయనకు సినిమా ఇండస్ట్రీలో బాగా కలిసి వచ్చింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ అందరిని ఆకట్టుకున్న ప్రయత్నం చేస్తున్నారు అడివి శేషు. మొత్తానికైతే కృష్ణ పై తనకున్న అభిమానాన్ని అలా చాటుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు ఈ యంగ్ హీరో..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు